ప్రపంచకప్: ట్విట్టర్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పిన భారత్-పాక్ మ్యాచ్

హైదరాబాద్: భారత్-పాక్ మ్యాచ్ అంటే చాలు భావోద్వేగాలతో కూడుకుని ఉంటుంది. ఇరు దేశాల్లో అభిమానులకు ఈ మ్యాచ్ ఎంతో ప్రత్యేకం. ఇరు దేశాలకు చెందిన అభిమానులు మాత్రం ఓటమిని అసలు జీర్ణించుకోలేరు. తమ దేశం గెలవాలంటే తమ దేశం గెలవాలని కోరుకుంటారు. క్రికెటర్లకు అన్ని మ్యాచ్‌లు లాగే ఇది ఓ మ్యాచ్ కావొచ్చు... కానీ, అభిమానులకు మాత్రం అలా కాదు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మైదానంలో క్రికెటర్లు మ్యాచ్ ఆడుతంటే టీవీలకు అతుక్కుపోయి మరీ వీక్షిస్తుంటారు. అలా ఈ మ్యాచ్‌ని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించారు. ఇక, సోషల్ మీడియాలో కూడా భారత్-పాక్ మ్యాచ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలో భారత్-పాక్ మ్యాచ్ ట్విట్టర్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

అత్యధిక ట్వీట్స్ వచ్చిన వన్డే మ్యాచ్‌గా రికార్డు
ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక ట్వీట్స్ వచ్చిన వన్డే మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ గురించి దాదాపు 2.9 మిలియన్ల ట్వీట్స్ వెలువడ్డాయి. #TeamIndia, #WeHaveWeWill అన్న ట్వీట్స్ ఆ సమయంలో విపరీతంగా ట్విట్టర్‌లో ట్రెండ్ అయ్యాయి. దీంతో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి కూడా ఎక్కువ మంది మాట్లాడుకున్నారు.

విజయ్ శంకర్ తొలి బంతికే వికెట్ తీయడం
భారత్-పాక్ మ్యాచ్‌లో ఆల్ రౌండర్ విజయ్ శంకర్ తొలి బంతికే వికెట్ తీయడం ఆరోజు మ్యాచ్‌లో బెస్ట్ మోమెంట్ అని ట్విట్టర్ తెలిపింది. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌లో భారత్-పాక్ జట్లు ఇప్పటివరకు ఏడు సార్లు తలపడగా ఏడు సార్లూ టీమిండియానే విజయం సాధించడం విశేషం.

89 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
గత ఆదివారం మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.

పలుమార్లు వరుణుడు అంతరాయం
అనంతరం 337 పరుగుల లక్ష్య చేధనలో పలుమార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను 40 ఓవర్లకు కుదించారు. దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్థాన్‌కు 40 ఓవర్లలో 302 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే, పాకిస్థాన్ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications