Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ హాఫ్ సెంచరీ.. పాండ్యా, ధోనీ ఔట్

ICC Cricket World Cup 2019, India vs Pakistan: Virat Kohli hits Half Century, MS Dhoni & Hardhik Pandya fall in quick succession

ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. పాక్ స్టార్ పేసర్ ఆమిర్‌ వేసిన 43.1వ బంతికి రెండు పరుగులు తీసి కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. మొదటలో పరుగులు చేయడానికి ఇబ్బందిపడ్డ కోహ్లీ.. అనంతరం వేగం పెంచి 51 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

1
43665

అయితే భారీ షాట్ ఆడే క్రమంలో హార్డ్ హిట్టర్ హార్దిక్ పాండ్యా (26; 19 బంతుల్లో 2×4, 1×6) ఔటయ్యాడు. మరోవైపు హాఫ్ సెంచరీ అనంతరం కోహ్లీ బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. ఇక ఆమిర్‌ వేసిన 45.1వ బంతికి ధోనీ (1) కీపర్‌ సర్ఫరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో పరుగుల వేగం తగ్గింది. ప్రస్తుతం భారత్ 46 ఓవర్లు ముగిసేసరికి 302 పరుగులు చేసింది. కోహ్లీ (70), విజయ్ శంకర్ (1) క్రీజులో ఉన్నారు.

అంతకుముందు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సెంచరీ సాధించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి పాక్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ఇన్నింగ్‌ 30 ఓవర్‌లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. పాక్‌ బౌలర్‌ షెహదాబ్‌ ఖాన్‌ వేసిన 30 ఓవర్‌ చివరి బంతికి సింగిల్‌ తీసి రోహిత్‌ 100 ( 85 బంతుల్లో 9×4, 3×6) సెంచరీ పూర్తి చేశాడు. ఇది రోహిత్‌కు వన్డే కెరీర్‌లో 24వ సెంచరీ. ఈ ప్రపంచకప్‌లో రెండో సెంచరీ. టోర్నీ ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ తొలి సెంచరీ అందుకున్నాడు.

{headtohead_cricket_3_5}

Story first published: Sunday, June 16, 2019, 18:40 [IST]
Other articles published on Jun 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+