ప్రపంచకప్‌లో భారత్ Vs పాక్: గత రికార్డులివే!

హైదరాబాద్: ప్రపంచకప్‌లో టీమిండియా తన తదుపరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడనుంది. మాంచెస్టర్ వేదికగా జూన్ 16(ఆదివారం) ఈ మ్యాచ్ జరగనుంది. ఇండియా-కివీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి టోర్నీకే హైలెట్‌గా నిలిచే ఈ మ్యాచ్‌పై పడింది. భారత్-పాక్ మ్యాచ్ అంటే ఆ క్రేజే వేరు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్ కోసం భారత్, పాక్ అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు సైతం ఆసక్తిని కనబరుస్తారు. కాగా, టోర్నీలో టీమిండియా రెండు వరుస విజయాలు సాధించగా గురువారం న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఏడు పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా... ఐదు పాయింట్లతో భారత్ మూడోస్థానంలో కొనసాగుతోంది.
{headtohead_cricket_3_5}
ఇక, పాక్ నాలుగు మ్యాచ్‌లకు గాను రెండింట ఓడి, పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 1992 నుండి 2015 ప్రపంచకప్ వరకు భారత్, పాక్‌లు ఆరుసార్లు తలపడగా.. ఆరుసార్లు భారతే విజేతగా నిలిచింది. ప్రస్తుతం ప్రపంచకప్‌లో మరోసారి ఇరు జట్లు తలపడనున్న నేపథ్యంలో గణాంకాలను ఒక్కసారి పరిశీలిద్దాం...

అత్యధిక స్కోరు
భారత్-పాక్ జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో 2005లో టీమిండియా 356/9 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ధోని 148 పరుగులు చేశాడు. ఇక, పాకిస్థాన్ విషయానికి వస్తే భారత్‌పై 344/8 అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఇక, అత్యల్ప స్కోరు విషయానికి వస్తే 1978లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 79 పరుగులకే కుప్పకూలింది. వన్డేల్లో పాక్‌పై భారత్‌కిదే అత్యల్ప స్కోర్. కాగా పాకిస్థాన్ అత్యల్పస్కోర్ 87 పరుగులకే ఆలౌటైంది.

అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పాకిస్థాన్‌పై మొత్తం 67 ఇన్నింగ్స్‌లో 2526 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇంజిమామ్ ఉల్ హాక్ 64 ఇన్నింగ్స్‌లో 2403 పరుగులు చేశాడు. ఇక, అత్యధిక వ్యక్తిగత పరుగుల విషయానికి వస్తే సయీద్ అన్వర్ చేసిన 194 పరుగులే ఇరు జట్ల మధ్య వ్యక్తిగత అత్యధిక పరుగుల రికార్డు.

అత్యధిక సెంచరీలు
టీమిండియా తరఫున సచిన్ టెండూల్కర్, పాక్ తరఫున సల్మాన్ ఐదు సెంచరీలు సాధించారు. సచిన్ టెండూల్కర్ 67 ఇన్నింగ్స్‌లో ఈ సెంచరీలు పూర్తి చేస్తే సల్మాన్ 21 ఇన్నింగ్స్‌లో పూర్తి చేశాడు.

అత్యధిక డకౌట్లు
భారత్-పాక్ మ్యాచ్‌ల్లో భారత మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్, పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ చెరో ఆరుసార్లు డకౌట్లుగా వెనుదిరిగారు.

అత్యధిక వికెట్లు
టీమిండియాతో జరిగిన మ్యాచ్‌ల్లో పాక్ పేసర్ వసీమ్ అక్రమ్ 47 ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 60 వికెట్లు తీశాడు. ఇక, భారత్ విషయానికి వస్తే అనిల్ కుంబ్లే 33 ఇన్నింగ్స్‌లో 54 వికెట్లు పడగొట్టాడు.

అత్యధిక వికెట్ కీపింగ్ డిస్మిసల్స్
పాకిస్థాన్ వికెట్ కీపర్ మోయిన్ ఖాన్ 47 ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 71 వికెట్లు తీశాడు. ఇందులో 58 క్యాచులు, 13 స్టంపింగులు ఉన్నాయి. అతడి తర్వాత ధోని 33 ఇన్నింగ్స్‌లో 40 మందిని ఔట్ చేశాడు.

అత్యధిక క్యాచులు
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ 64 ఇన్నింగ్స్‌లో 44 క్యాచులు పట్టాడు. ఇరు జట్ల మధ్య ఇదే అత్యుత్తమ క్యాచుల రికార్డు కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications