సేమ్ షాట్: అప్పుడు సచిన్.. ఇప్పుడు రోహిత్ (వీడియో)

క్రికెట్ ఆటలో ఎవరి ప్రత్యేక శైలి వారికి ఉంటుంది. తమదైన శైలి ఆటతో క్రికెట్ అభిమానులను అలరిస్తుంటారు. ఒక్కోసారి ఒక బ్యాట్స్‌మన్ మరో బ్యాట్స్‌మన్ ఆడిన షాట్ ఆడుతాడు. తాజాగా ఇలాంటి ఘటనే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది. టీంఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ మాజీ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఆడిన షాట్ ఆడాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
85 బంతుల్లో సెంచరీ:
టాస్ ఓడి భారత్ బ్యాటింగ్‌కు దిగగా.. రోహిత్ శర్మ (140; 113బంతుల్లో 14×4, 3×6) తనదైన బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త నెమ్మదించిన రోహిత్.. అనంతరం గేర్ మార్చి 85 బంతుల్లోనే సెంచరీ చేసాడు. ఇక సెంచరీ అనంతరం మరింత రెచ్చిపోయాడు. రోహిత్ మైదానం నలుమూలలా షాట్లతో అలరించాడు. రోహిత్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లో ఇదొకటి. రోహిత్ భారీ సెంచరీతో టీమిండియా 336 పరుగులు చేసింది.

సచిన్ షాట్‌ను గుర్తు చేసాడు:
అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ ఆడిన ఓ షాట్ సచిన్ ఆడిన షాట్‌ను గుర్తుకు తెచ్చింది. ఇన్నింగ్స్ 26 ఓవర్ రెండో బంతిని పాక్ బౌలర్ అసన్ అలీ వేయగా.. రోహిత్ అప్పర్‌కట్ షాట్ ఆడాడు. బంతి కాస్తా స్టాండ్స్ లోకి వెళ్లి పడింది. 2003 ప్రపంచకప్‌లో కూడా సచిన్ పాకిస్థాన్‌పై ఇలాంటి షాటే ఆడాడు. అప్పర్‌కట్ షాట్‌తో అప్పటి సచిన్ షాట్‌ను రోహిత్ గుర్తు చేసాడు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
బెటర్ షాట్ ఎవరిది:
2003 ప్రపంచకప్‌లో సచిన్ 75 బంతుల్లో 98 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ ఒకే ఒక్క సిక్స్ కొట్టగా.. అది అప్పర్‌కట్ షాట్ ఆడాడు. సచిన్ కెరీర్‌లో ఆ ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకం. ఆ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిన్నటి మ్యాచ్‌లో రోహిత్ మూడు సిక్సులు బాదాడు. అయితే ఐసీసీ ఓ పోస్ట్ ద్వారా ఎవరు బెటర్ షాట్ ఆడారు అని అభిమానులను అడిగింది. దీనికి అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు కురిపిస్తున్నారు.

టీమిండియా విజయం:
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల (డక్‌వర్త్ లూయిస్) తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ (140) భారీ శతకం.. విరాట్ కోహ్లీ (77), కేఎల్ రాహుల్ (57) హాఫ్ సెంచరీలు చేయడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 336 పరుగులు చేసింది. పాక్ పేసర్ ఆమిర్‌కు మూడు వికెట్లు తీసాడు. లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభంలోనే తడబడింది. ఇక పాక్ స్కోర్ 166/6 వద్ద వర్షం పడడంతో లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302 పరుగులుగా నిర్ణయించారు. కానీ పాక్ ఆరు వికెట్లకు 212 పరుగులే చేసి ఓడింది. ఫఖర్ జమాన్ (62), బాబర్ ఆజమ్ (48), ఇమాద్ వసీమ్ (46 నాటౌ ట్) రాణించారు. కుల్దీప్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యాలకు రెండేసి వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications