న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్‌కు మొదలైన టెన్షన్.. చెప్పింది ఎవరో కాదు...

ICC Cricket World Cup 2019, India vs Pakistan: Pakistans must-win match against India as huge pressure game says Imam-ul-Haq

ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్ మ్యాచ్‌ అంటే ఒత్తిడి తప్పదు. సెమీస్‌ బరిలో నిలవాలంటే ఆ మ్యాచ్‌లో తప్పక గెలవాలి అని పాక్ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ అన్నారు. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇమామ్‌ అర్ధ శతకం చేసి మంచి ఆరంభం ఇచ్చినా.. పాక్ ఓటమి నుండి తపించుకోలేకపోయింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మ్యాచ్‌ అనంతరం ఇమామ్‌ మాట్లాడుతూ... 'ఒక మ్యాచ్‌ వర్షంతో రద్దయింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఓడిపోయాం. మంచి ఆరంభమే లభించినా మేము సద్వినియోగం చేసుకోలేదు. కొన్ని పొరపాట్లు చేసాం. అమిర్ అద్భుతంగా బౌలింగ్ చేసాడు. తప్పులను సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి' అని ఇమామ్‌ పేర్కొన్నారు.

'టోర్నీలో ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్‌ ముఖ్యమే. మా తరువాతి మ్యాచ్ టీమిండియాతో. ఆ మ్యాచ్ మాకు కీలకం. భారత్‌తో మ్యాచ్ అంటే అత్యంత ఒత్తిడి ఉంటుంది. సెమీస్‌ బరిలో నిలవాలంటే తప్పక గెలవాలి. ఈ మ్యాచ్‌లో ఆడుతున్నందుకు సంతోషం. మాంచెస్టర్‌లో పాక్‌ అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి నాకెంతో ఆత్రుతగా ఉంది. భారత్‌, పాక్‌ మ్యాచ్‌ అంటే ఎన్నో రహస్యాలు ఉంటాయి. అయితే మేం కేవలం మా బలాలు, ఆటపై దృష్టిపెడతాం. ఈ మ్యాచ్‌లో రాణించేందుకు ప్రయత్నిస్తా' అని ఇమామ్‌ చెప్పారు.

'ఈ ఓటమి మమ్మల్ని నిరాశపరిచింది. కేవలం 15 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడం మ్యాచ్‌పై ప్రభావం చూపింది. ఓడిపోయినా కూడా మాకు కొన్ని సానుకూలాంశాలు ఉన్నాయి. హసన్‌ అలీ, వహాబ్‌ రియాజ్‌లు బాగా బ్యాటింగ్ చేశారు. చివరి వరకు పోరాడినా విజయం సాదించలేకపోయాం. అమిర్ తప్ప మిగతా బౌలర్లు రాణించలేదు. ఇది 270-80 పిచ్. కానీ మేము ఇంకా 30 పరుగులు ఎక్కువే ఇచ్చాం. ఛేదనలో టాప్ నలుగురు బ్యాట్స్‌మన్‌ రాణించాలి. వారు పరుగులు చేసినా.. పెద్ద స్కోర్లు సాధించడంలో విఫలమయ్యారు. భారత్‌, పాక్‌ మ్యాచ్ చాలా పెద్ద మ్యాచ్. భారత్‌పై గెలిచేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తాం' అని సర్ఫరాజ్‌ తెలిపారు.

Story first published: Thursday, June 13, 2019, 19:15 [IST]
Other articles published on Jun 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X