అక్తర్ ఘాటు వ్యాఖ్యలు.. సర్ఫరాజ్ 'బ్రెయిన్‌లెస్ కెప్టెన్'
పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్‌అహ్మద్ బ్రెయిన్‌లెస్ కెప్టెన్ అని పాక్ మాజీ బౌలర్, స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నారు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 89 పరుగుల (డక్‌వర్త్ లూయిస్) తేడాతో ఘోర పరాజయం పాలైంది.
దీంతో పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఆ జట్టు మాజీ క్రికెటర్‌లు, అభిమానులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌పై మండిపడుతున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

బ్రెయిన్‌లెస్ కెప్టెన్:
'పాకిస్తాన్ టాస్ గెలవగానే సగం మ్యాచ్ గెలిచాం అనుకున్నాం. కానీ సర్ఫరాజ్ చేజేతులా మ్యాచ్‌ను చేజార్చాడు. టాస్ చాలా కీలకం. పాకిస్తాన్ 260 పరుగులు చేసినా.. పాక్ తన బౌలింగ్‌తో మ్యాచును కాపాడుకునేది. నిజంగా సర్ఫరాజ్ బ్రెయిన్‌లెస్ కెప్టెన్. కెప్టెన్‌గా అతను చేసిన పనితో అందరం నిరాశ చెందాం. అతనిలో ఇమ్రాన్ ఖాన్ షేడ్స్ చూడాలనుకున్నా.. కానీ అతను మాత్రం బ్రెయిన్‌లెస్ పనులతో చిరాకు తెపిస్తున్నాడు' అని మండిపడ్డాడు. వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ ఓడినప్పుడు కూడా అక్తర్.. సర్ఫరాజ్‌పై ఘాటు వాక్యాలే చేసాడు.

వన్డేల్లో రాణించట్లేదు:
9 ఓవర్లు వేసిన పాక్ పేసర్ హసన్ అలీ 84 పరుగులు ఇచ్చాడు. దీనిపై కూడా అక్తర్ స్పందించాడు. 'హసన్ అలీ కేవలం టీ20, పీఎస్‌ఎల్‌లు మాత్రమే చాలనుకుంటున్నాడు. వన్డేల్లో ఏమాత్రం రాణించట్లేదు. బ్యాట్స్‌మెన్ బౌండరీలు బాదుతున్నా.. షార్ట్ పిచ్ బంతులు అలాగే వేసాడు. అతని బౌలింగ్‌లో ఎలాంటి పేస్, స్వింగ్ కనిపించలేదు' అని చురకలంటించాడు.

టీమిండియా విజయం:
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల (డక్‌వర్త్ లూయిస్) తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ (140) భారీ శతకం.. విరాట్ కోహ్లీ (77), కేఎల్ రాహుల్ (57) హాఫ్ సెంచరీలు చేయడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 336 పరుగులు చేసింది. పాక్ పేసర్ ఆమిర్‌కు మూడు వికెట్లు తీసాడు. లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభంలోనే తడబడింది. ఇక పాక్ స్కోర్ 166/6 వద్ద వర్షం పడడంతో లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302 పరుగులుగా నిర్ణయించారు. కానీ పాక్ ఆరు వికెట్లకు 212 పరుగులే చేసి ఓడింది. ఫఖర్ జమాన్ (62), బాబర్ ఆజమ్ (48), ఇమాద్ వసీమ్ (46 నాటౌ ట్) రాణించారు. కుల్దీప్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యాలకు రెండేసి వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications