Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌-పాక్ మ్యాచ్.. నేను బాగా ఆడాలని స్వర్గం నుంచి నా తల్లి ప్రార్థిస్తుంది

ICC Cricket World Cup 2019, India vs Pakistan: Mohammad Amir inspired by memory of late mother ahead of Manchester Match

నా తల్లి నసీం అక్తర్‌ నేను బాగా ఆడాలని స్వర్గం నుంచి తప్పకుండా ప్రార్థిస్తుంది అని పాకిస్థాన్‌ స్టార్ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌ గుర్తు చేసుకున్నారు. ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం చిరకాల ప్రత్యర్ధులు భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే కీలక మ్యాచ్ సందర్భంగా పాక్ బౌలర్ మహ్మద్‌ ఆమిర్‌ తన తల్లి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

'ఈ మ్యాచ్‌లో నేను బాగా ఆడాలని స్వర్గం నుంచి నా తల్లి తప్పకుండా ప్రార్థిస్తుంది. మ్యాచ్‌ జరిగేటప్పుడు ప్రతిసారీ నా తల్లి టీవీ ముందు కూర్చొని బాగా ఆడాలని కోరుకునేది. ముఖ్యంగా భారత్‌తో మ్యాచ్‌లో. ఈ రోజటి మ్యాచ్‌లో రాణిస్తాననే నమ్మకం ఉంది. నేను ఐదు వికెట్లు తీయడమే మా తల్లి కోరిక. ఆస్ట్రేలియాపై ఐదు వికెట్లు తీసిన వెంటనే కన్నీళ్లొచ్చాయి. వెంటనే నా తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. సరైన సమయంలో వికెట్లు తీయడం సంతోషంగా ఉంది. వికెట్లు తీయనపుడు కూడా కెప్టెన్, కోచ్ నాకు అండగా ఉన్నారు' అని ఆమిర్‌ తెలిపారు.

తొలుత ప్రకటించిన ప్రపంచకప్‌ పాక్ జట్టులో ఆమిర్‌కు చోటు దక్కలేదు. చివరి నిమిషంలో చోటు సంపాదించుకున్న ఆమిర్‌.. తన మార్క్ బౌలింగ్‌తో నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో.. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇక 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత టాప్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చిన అమిర్.. ఈ రోజు మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి.

Story first published: Sunday, June 16, 2019, 12:53 [IST]
Other articles published on Jun 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+