భారత్ Vs పాక్: బ్లాక్‌లో టికెట్ విక్రయాలు, ఆకాశాన్నంటిన ధరలు

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇరుదేశాల అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమనులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం ఈ మ్యాచ్‌కి ఉన్న క్రేజే వేరు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

క్రేజ్‌ను అవకాశంగా తీసుకుని
అయితే, ఈ క్రేజ్‌ను అవకాశంగా తీసుకుని అభిమానుల నుంచి డబ్బులు దండుకుంటోంది ఓ వెబ్‌సైట్. ఈ ఆదివారం మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరిగే భారత్-పాక్ మ్యాచ్‌కి సంబంధించిన టిక్కెట్లన్నీ కొద్ది గంటల్లోనే అమ్ముడయ్యాయి. అయితే, ఇది హైఓల్టేజ్ మ్యాచ్ కావడం, ఈ మ్యాచ్‌ని ఎలాగైనా వీక్షించాలనే ఉద్దేశ్యంతో టిక్కెట్లను అభిమానులు బ్లాక్‌లో కొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

వియాగోగో వెబ్‌సైట్ నిర్వాహకం
అయితే, దీనిని పసిగట్టిన వియాగోగో అనే వెబ్‌సైట్ ఇదివరకే టిక్కెట్లు దక్కించుకున్నవారి నుంచి కొనుగోలు చేసి అధిక ధరకు వాటిని విక్రయిస్తోంది. ఈ మ్యాచ్ టిక్కెట్లు కొన్న 480 మంది వియాగోగో అనే వెబ్‌సైట్‌ను సంప్రదించి తమ టిక్కెట్లను అమ్ముకోగా.. వాటిని కేటగిరీలను బట్టి రూ.20వేల నుంచి రూ.60వేల దాకా వెబ్‌సైట్ మళ్లీ విక్రయిస్తోంది.

ప్లాటినమ్ కేటగిరీ టిక్కెట్టు అత్యధికంగా
ఈ వెబ్‌సైట్ ద్వారా ప్లాటినమ్ కేటగిరీ టిక్కెట్టు అత్యధికంగా రూ. 62,610కి అమ్ముడవగా, బ్రాంజ్ కేటగిరీ టిక్కెట్టు రూ. 20,171లకు అభిమానులు కోనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 1992 నుండి 2015 ప్రపంచకప్ వరకు భారత్, పాక్‌లు ఆరుసార్లు తలపడగా.. ఆరుసార్లు భారతే విజేతగా నిలిచింది.

ప్లాటినమ్ కేటగిరీ టిక్కెట్టు అత్యధికంగా
ఇదిలా ఉంటే, టోర్నీకే హై ఓల్టేజ్ మ్యాచ్‌గా పిలువబడే భారత్-పాక్ మ్యాచ్‌ని కూడా వరుణుడు వదిలా కనిపించడం లేదు. ఈ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోన్న మాంచెస్టర్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.
{headtohead_cricket_3_5}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications