పాక్‌పై భారత్ ఘనవిజయం: ప్రపంచకప్‌లో తిరుగులేని రికార్డు కొనసాగింపు

Rohit

మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై తమకు ఎదురులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. ఏకంగా ఏడోసారి ఓడించి ప్రపంచకప్‌లో పాక్‌పై తన విజయ పరంపరను భారత్‌ కొనసాగించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. అనంతరం 337 పరుగుల లక్ష్య చేధనలో పలుమార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను 40 ఓవర్లకు కుదించారు. దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్థాన్‌కు 40 ఓవర్లలో 302 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

అయితే, పాకిస్థాన్ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేసింది. ఈ విజయంతో భారత్ వరుసగా ఏడో సారి ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన రోహిత్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.


Auto Refresh Feeds
12:06 am

మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌కు ఇది ఏడో విజయం

11:54 pm

పాకిస్థాన్‌ లక్ష్యాన్ని డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం సవరించారు. 40 ఓవర్లకు ఇన్నింగ్స్‌ను కుదించారు. 302ను లక్ష్యంగా విధించారు. అంటే ఇప్పుడు 30 బంతుల్లో ఆ జట్టు 136 పరుగులు చేయాలి.

11:53 pm

ప్రస్తుతం భారత్‌ విజయానికి 4 వికెట్ల దూరంలో ఉంది. వర్షంతో మ్యాచ్‌ కొనసాగేందుకు వీలుకాకుంటే డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం విజేతను ప్రకటించాల్సి ఉంటుంది. పాక్‌ విజయం సాధించాలంటే 35 ఓవర్లకు 252 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 86 పరుగుల దూరంలో ఉంది

11:52 pm

వర్షం పడుతున్న సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇలా

11:52 pm

భారత్‌×పాక్‌ మ్యాచ్‌కు మరోసారి వరుణుడు అంతరాయం కలిగించాడు. చిరుజల్లులు మొదలవ్వడంతో ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. పిచ్‌పై కవర్లను కప్పారు. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం కోహ్లీసేనకు విజయావకాశాలు ఉన్నాయి.

10:31 pm

హార్దిక్ పాండ్యా హ్యాట్రిక్ వికెట్ తీయకుండా పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అడ్డుకున్నాడు

10:13 pm

ఒకే ఓవర్‌లో వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసిన హార్దిక్ పాండ్యా. 26.5వ బంతికి హఫీజ్‌ను ఔట్‌ చేసిన అతడు తర్వాతి బంతికి షోయబ్‌ మాలిక్‌ (0; 1బంతుల్లో)ను గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ పంపించాడు.

09:48 pm

భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఫకార్ జమాన్ హాఫ్ సెంచరీ సాధించాడు.

08:55 pm

భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో బాబర్ ఆజామ్(13), ఫకార్ జమాన్(16) పరుగులతో ఉన్నారు.

08:28 pm

పాక్ తొలి వికెట్ కోల్పోయింది. విజయ్ శంకర్ బౌలింగ్‌లో పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్(7) పరుగుల వద్ద ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 5 ఓవర్లకు వికెట్ నష్టానికి పాకిస్థాన్ 14 పరుగులు చేసింది.

08:09 pm

ప్రపంచవ్యాప్తంగా భారత్-పాక్ మ్యాచ్‌ని అభిమానులు వీక్షిస్తున్నారిలా

08:03 pm

మాంచెస్టర్‌లో చిరుజల్లులు మళ్లీ మొదలయ్యాయి. మైదాన సిబ్బంది పిచ్‌పైకి మళ్లీ కవర్లు తీసుకొచ్చారు. దీంతో వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్‌ సజావుగా కొనసాగుతుందో లేదో చూడాలి మరి.

07:50 pm

ప్రపంచకప్‌లో భాగంగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు లోకేశ్ రాహుల్-రోహిత్ శర్మలు తొలి వికెట్‌కు 136 పరుగులు జోడించారు. కేఎల్ రాహుల్(57) పరుగుల వద్ద రియాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

07:50 pm

ఆ తర్వాత రోహిత్ శర్మ సెంచరీ నమోదు చేశాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 24వ సెంచరీ. అయితే, రోహిత్ శర్మ 113 బంతుల్లో140(14 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హసన్ అలీ బౌలింగ్‌లో రియాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యా(26) బ్యాట్‌ను ఝళిపించినప్పటికీ భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యాడు.

07:50 pm

అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని ఒక్క పరుగుకే ఔటయ్యాడు. ఈ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో కాసేపు మ్యాచ్ నిలిచిపోయింది. ఆట తిరిగి ప్రారంభమయ్యాక కోహ్లీ(77) పరుగుల వద్ద ఆమీర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. చివర్లో విజయ్ శంకర్(15), కేదార్ జాదవ్‌(9)పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ ఆమిర్ మూడు వికెట్లు పడగొట్టగా, హసన్ అలీ, వాహబ్ రియాజ్ చెరో వికెట్ తీసుకున్నారు.

07:39 pm

అంపైర్‌ ఔటివ్వకపోయినా విరాట్‌ కోహ్లీ స్వయంగా పెవిలియన్‌ వెళ్లాడు. అయితే, రిప్లేల్లో విరాట్‌ కోహ్లీ నాటౌట్‌ అని తేలింది. బంతికి, బ్యాటుకు చాలా దూరంగా వెళ్లింది. అయితే. ఔట్ అనుకుని విరాట్‌ కోహ్లీ పెవిలియన్‌ వచ్చేశాడు.

07:39 pm

మరోసారి ఆమిర్‌ బౌలింగ్‌లోనే విరాట్‌ కోహ్లీ ఔటయ్యాడు. ఆమీర్ వేసిన 47.4వ బంతికి విరాట్‌ కోహ్లీ (77; 65 బంతుల్లో 7 ఫోర్లు) వికెట్ కీపర్ సర్ఫరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో అంపైర్‌ ఔటివ్వకపోయినా విరాట్‌ కోహ్లీ స్వయంగా పెవిలియన్‌ వెళ్లాడు.

07:29 pm

వర్షం అనంతరం ఆట తిరిగి మొదలైంది.

06:41 pm

మాంచెస్టర్‌లో వర్షం మరింతగా పెరిగింది. చిరుజల్లులుగా మొదలైన వాన ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఔట్‌ఫీల్డ్‌పై కప్పినట్టు కనిపించడం లేదు. ఓవర్లకు కుదించడానికి ముందు 75 నిమిషాల సమయం ఉంటుంది. వర్షంతో మ్యాచ్ నిలిచే సమయానికి46.4 ఓవర్లకు భారత్‌ 305/4తో ఉంది.

06:22 pm

భారత్-పాక్ మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగించాడు. చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో అంఫైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. వర్షంతో మ్యాచ్ నిలిచే సమయానికి46.4 ఓవర్లకు భారత్‌ 305/4తో ఉంది.

06:20 pm

పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 300 పరుగుల మార్కుని అందుకుంది. ప్రస్తుతం 46 ఓవర్లకు గాను నాలుగు వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. క్రీజులో విజయ్ శంకర్(1), విరాట్ కోహ్లీ (70) పరుగులతో ఉన్నారు.

06:14 pm

ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ 57 పరుగులు చేయడంతో వన్డేల్లో 11వేల పరుగులు పూర్తిచేసిన తొమ్మిదో ఆటగాడిగా అతడు అరుదైన ఘనత సాధించాడు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్‌లో 11వేల మైలురాయిని అందుకున్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు కేవలం 221 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడటం విశేషం. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో అత్యంత వేగంగా రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు చేశాడు.

06:09 pm

పాక్ పేసర్ ఆమీర్ చెలరేగుతున్నాడు. ఇప్పటికె రెండు వికెట్లు పడగొట్టాడు. జట్టు స్కోరు 298 పరగుల వద్ద ధోని(1) ఆమీర్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 46 ఓవర్లకు గాను నాలుగు వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. క్రీజులో విజయ్ శంకర్(1), విరాట్ కోహ్లీ (70) పరుగులతో ఉన్నారు.

06:00 pm

పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. మహ్మద్ ఆమిర్‌ వేసిన 43.1వ బంతికి రెండు పరుగులు తీసి విరాట్‌ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 44 ఓవర్లకు గాను మూడు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ (56), ధోని(0) పరుగులతో ఉన్నారు.

05:48 pm

పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా

05:40 pm

రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. రోహిత్ శర్మ 113 బంతుల్లో 140(14 ఫోర్లు, 3 సిక్సులు) పరుగుల వద్ద హసన్‌ అలీ వేసిన 38.2వ బంతికి అతడు రియాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి పాండ్యా వచ్చాడు. ప్రస్తుతం 39 ఓవర్లకు గాను రెండు వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. క్రీజులో పాండ్యా(4), విరాట్ కోహ్లీ (30) పరుగులతో ఉన్నారు.

05:37 pm

రోహిత్ శర్మ సెంచరిపై మాంచెస్టర్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఐసీసీ తన ట్విట్టర్‌లో పంచుకుంది.

05:20 pm

పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 200 పరుగుల మార్కుని అందుకుంది. ప్రస్తుతం 35 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 206 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(119), విరాట్ కోహ్లీ (24) పరుగులతో ఉన్నారు.

05:18 pm

Fewest innings to 24 ODI 100s: 142 H Amla 161 V Kohli 192 AB de Villiers 203 ROHIT SHARMA 219 S Tendulkar

05:15 pm

వన్డేల్లో రోహిత్ శర్మ ఇప్పటివరకు మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో డబుల్ సెంచరీ సాధిస్తాడా?

05:06 pm

ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. షాదాబ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 30వ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసి రోహిత్ శర్మ 85 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో సెంచరీ సాధించాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 24వ సెంచరీ. ఈ సిరిస్‌లో రోహిత్ శర్మకు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. దీంతో 30 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టానికి 172 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(100), విరాట్ కోహ్లీ (9) పరుగులతో ఉన్నారు.

04:57 pm

కేఎల్ రాహుల్‌(57)ని మొదటి వికెట్‌గా పెవిలియన్‌కు చేర్చిన వాహబ్ రియాజ్. 28 ఓవర్లకు గాను భారత్ వికెట్ నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(94), విరాట్ కోహ్లీ (7) పరుగులతో ఉన్నారు.

04:43 pm

25 ఓవర్లకు గాను భారత్ వికెట్ నష్టానికి 146 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ ఔటైన తర్వాత క్రీజులోకి విరాట్ కోహ్లీ వచ్చాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(81), విరాట్ కోహ్లీ (3) పరుగులతో ఉన్నారు.

04:38 pm

జట్టు స్కోరు 136 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. వాహబ్‌ వేసిన 23.5 బంతిని షాట్‌ ఆడిన కేఎల్ రాహుల్(57) పరుగుల వద్ద బాబర్‌ అజామ్‌ చేతికి చిక్కాడు.

04:28 pm

పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేఎల్ రాహుల్.. మాలిక్‌ వేసిన 21.4బంతిని సిక్స్‌గా మలిచి హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. 69 బంతుల్లో 3 పోర్లు, ఒక సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 22 ఓవర్లకు గాను 123 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(69), రాహుల్ (51) పరుగులతో ఉన్నారు.

04:17 pm

ప్రపంచకప్‌లో పాక్‌పై 100కుపైగా భాగస్వామ్యాలను నమోదు చేసిన ఓపెనర్లు వీరే: 132 G Greenidge - D Haynes, Oval, 1979 115 G Fowler - C Tavare, Manchester, 1983 175*D Haynes - B Lara, MCG, 1992 147 R Smith - M Atherton, Karachi, 1996 146 D Warner - A Finch, Taunton, 2019 104*R SHARMA - KL RAHUL, Manchester, 2019

04:11 pm

పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగుల మార్క్‌ని అందుకుంది. ప్రస్తుతం 18 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టపోకుండా 101 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(61), రాహుల్ (37) పరుగులతో ఉన్నారు.

04:09 pm

రనౌట్ నుంచి తప్పించుకున్న రోహిత్ శర్మ

04:03 pm

15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. మరోవైపు పాక్‌ స్పిన్నర్లు కట్టడి చేస్తున్నారు. ఆరంభ ఓవర్లలో పరుగులు ఇచ్చినా.. ఆ తర్వాత భారత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. క్రీజులో రోహిత్ శర్మ(53), రాహుల్ (32) పరుగులతో ఉన్నారు.

03:55 pm

రోహిత్‌ హాఫ్ సెంచరీ సాధించాడు. షాదాబ్‌ వేసిన నాలుగో బంతిని భారీ సిక్సర్‌గా మలచగా... ఆ తర్వాతి బంతిని బౌండరీకి తరలించి రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మకు ఇది మూడో సెంచరీ. ప్రస్తుతం 12 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ కోల్పోకుండా 79 పరుగులు చేసింది, క్రీజులో రోహిత్ శర్మ(50), రాహుల్ (27) పరుగులతో ఉన్నారు.

03:45 pm

మాంచెస్టర్ వేదికగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం 10 ఓవర్లకు గాను వికెట్ కోల్పోకుండా టీమిండియా 53 పరుగులు చేసింది. అయితే, ఈ ఓవర్ తొలి బంతికే రోహిత్‌(37) రనౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.పాక్‌ ఫీల్డర్ల సమన్వయ లోపం వల్ల రోహిత్‌ బతికిపోయాడు. కాగా ఆఖరి బంతిని మాత్రం రోహిత్‌ తనదైన స్టైల్‌లో బౌండరీకి తరలించి ఒత్తిడి తగ్గించాడు.క్రీజులో రోహిత్ శర్మ(37), కేఎల్ రాహుల్(14) పరుగులతో ఉన్నారు.

03:41 pm

ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన స్సిన్నర్‌ ఇమాద్‌ వసీం ఆకట్టుకున్నాడు. ఈ ఓవర్‌లో 4 పరుగులే ఇచ్చాడు. దీంతో 9 ఓవర్లకుగాను టీమిండియా వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(32), కేఎల్ రాహుల్(12) పరుగులతో ఉన్నారు.

03:34 pm

భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో మంచులక్ష్మి

మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న భారత్-పాక్ మ్యాచ్‌‌లో సినీ నటి మంచు లక్ష్మి సందడి చేశారు. భారత్‌కు మద్దతుగా జాతీయ జెండాతో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. పాక్‌పై టీమిండియా గెలవాలని ఆమె ఆకాంక్షించారు.

03:32 pm

మాంచెస్టర్ వదికగా పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. ప్రస్తుతం 7 ఓవర్లకుగాను వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేశారు. క్రీజులో రోహిత్ శర్మ(26), కేఎల్ రాహుల్(8) పరుగులతో ఉన్నారు.

03:24 pm

భారత్-పాక్ మ్యాచ్‌కి హాజరైన బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్.

03:24 pm

5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(16), కేఎల్ రాహుల్(4) పరుగులతో ఉన్నారు.

03:16 pm

భార‌త్ టాస్ ఓడ‌టం మంచికేనా

భారత్-పాక్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడిన సంగతి తెలిసిందే. అయితే, టాస్ ఓడటం మంచికేనా అంటే అవుననే అంటున్నారు. ఇంగ్లాండ్‌లో వ‌ర్షాలు ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశం. భార‌త్‌, పాక్ మ్యాచ్‌లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌ పిచ్‌పై ప‌చ్చిక కూడా లేదు. వ‌ర్ష ప్ర‌భావం నేప‌థ్యంలో ఆరంభంలో ఫాస్ట్‌బౌల‌ర్ల‌ను ఎదుర్కోవ‌డం బ్యాట్స్‌మెన్‌కు కొంచెం క‌ష్టంగా ఉంటుంది. ఐతే రికార్డు ప‌రిశీలిస్తే ఛేద‌న‌లో పాక్ ఎక్కువ‌సార్లు త‌డ‌బ‌డుతున్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. మెగా టోర్నీలో టీమిండియా చేతిలో ఓడిన ఆరు మ్యాచ్‌ల్లో(2003 మిన‌హా) ఐదు సార్లు పాక్ రెండోసారి బ్యాటింగ్ చేసింది.

03:08 pm

తొలి ఓవర్‌ను పాక్ పేసర్ మహ్మద్ ఆమీర్ కట్టుదిట్టంగా వేశాడు. దీంతో భారత ఓపెనర్లు ఢిఫెన్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో పరుగులేమీ చేయలేదు.

03:02 pm

జట్ల వివరాలు:

02:48 pm

టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయపడ్డ శిఖర్ ధావన్ స్థానంలో రోహిత్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనుండగా.. నాలుగో స్థానానికి ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను తుదిజట్టుకు ఎంపిక చేసినట్లు విరాట్ చెప్పాడు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో బౌలింగ్ ఎంచుకున్నామని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపాడు.

02:45 pm

భారత్-పాక్ మ్యాచ్ కాడవంతో పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు. ముఖ్యంగా టీమిండియాకు మద్దకు వేల కొద్దీ అభిమానులు స్టేడియానికి చేరుకుని ఇండియా ఇండియా అంటూ కేకలు పెడుతున్నారు.

02:44 pm

పాకిస్థాన్: ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్, మహ్మద్ హఫీజ్, సర్ఫరాజ్ అహ్మద్, షోయబ్ మాలిక్, వసీమ్, ఖాన్, అలీ, వాహబ్ రియాజ్, మహ్మద్ ఆమీర్

02:43 pm

టీమిండియా: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, ధోని, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా

02:35 pm

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

02:31 pm

భారత్-పాక్ మ్యాచ్‌కి సర్వం సిద్ధం. ఇరు జట్లు ఇప్పిటకే స్టేడియానికి చేరుకున్నాయి. మరో పది నిమిషాల్లో టాస్ వేయనున్నారు.

02:30 pm

తెల్లటి గుర్రంపై పాక్ జెండూ ఊపుతూ మాంచెస్టర్ స్టేడియానికి చేరుకున్న పాక్ అభిమాని

02:02 pm

భారత్-పాక్ మ్యాచ్‌ని వీక్షించేందుకు గాను వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌గేల్‌ ప్రత్యేకమైన డ్రెస్‌తో సిద్ధమయ్యాడు. ఒక వైపు భారత పతాకం రంగులు, మరో వైపు పాక్‌ జెండా రంగులతో ఉన్న డ్రెస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. తన బర్త్‌డే(సెప్టెంబర్‌ 20)కు కూడా ఇదే డ్రెస్‌ ధరిస్తానంటూ క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

01:56 pm

మాంచెస్టర్ స్టేడియానికి చేరుకున్న కోహ్లీ

మాంచెస్టర్ స్టేడియానికి చేరుకున్న టీమిండియా. మ్యాచ్ పైనే ఫోకస్ పెట్టిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.

01:47 pm

మాంచెస్టర్ స్టేడియంలో భారత్-పాక్ అభిమానుల మూడ్ ఇలా ఉంది

01:46 pm

కోహ్లీ మరో 57 పరుగులు చేస్తే

పాక్‌తో మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ 57 పరుగులు చేస్తే వన్డేల్లో 11వేల పరుగులు పూర్తిచేసిన తొమ్మిదో ఆటగాడిగా అతడు అరుదైన ఘనత అందుకోనున్నాడు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్‌లో 11వేల మైలురాయిని అందుకున్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు కేవలం 221 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడటం విశేషం. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో అత్యంత వేగంగా రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు చేయనున్నాడు.

01:19 pm

ఆదివారం ఉదయం మాంచెస్టర్‌లో

భారత్-పాక్ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోన్న మాంచెస్టర్ లో ఆదివారం ఉదయం వాతావరణం ఇలా ఉంది.

1
43665
1
5

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

Read more about: cricket
Story first published: Sunday, June 16, 2019, 13:16 [IST]
Other articles published on Jun 16, 2019
POLLS

Get breaking news alerts from myKhel

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more