Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పెళ్లికి వచ్చి భారత్-పాక్ మ్యాచ్ చూసిన అతిధులు

ICC Cricket World Cup 2019, India vs Pakistan: Kashmiri wedding guests ensure there is TV at ceremony so they dont miss the match

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వస్తోందంటే ఉండే హడావిడి అంతాఇంతా కాదు. మ్యాచ్ రోజూ సగటు క్రికెట్ అభిమానులు అందరూ టీవీలకు అత్తుకుపోతారు. ఆదివారం అయితే అభిమానుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రపంచకప్‌లో భారత్-పాక్ మ్యాచ్ అంటే ఎటువంటి పని ఉన్నా.. ఆ పనిని పక్కన పడేసి మరీ మ్యాచ్ తిలకిస్తారు. తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్ జరుగుతోంది. జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ పెళ్ళికి వచ్చిన అతిధులు పెళ్లి చూడడం వదిలేసి అక్కడ ఉన్న టీవీలో భారత్-పాక్ మ్యాచ్‌ను వీక్షించారు. వరుడు వచ్చినా కూడా అదేమీ పట్టించుకోకుండా మ్యాచ్ తిలకించారు. దీనికి సంబందించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింలో వైరల్ అయింది. నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్లు కురిపిస్తున్నారు.

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల (డక్‌వర్త్‌ లూయిస్‌) తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. రోహిత్‌ శర్మ (140) భారీ శతకం.. విరాట్ కోహ్లీ (77), కేఎల్ రాహుల్‌ (57) హాఫ్‌ సెంచరీలు చేయడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 336 పరుగులు చేసింది. పాక్ పేసర్ ఆమిర్‌కు మూడు వికెట్లు తీసాడు. లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభంలోనే తడబడింది. ఇక పాక్ స్కోర్ 166/6 వద్ద వర్షం పడడంతో పాక్‌ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302 పరుగులుగా నిర్ణయించారు. కానీ పాక్‌ ఆరు వికెట్లకు 212 పరుగులే చేసి ఓడింది. ఫఖర్‌ జమాన్‌ (62), బాబర్‌ ఆజమ్‌ (48), ఇమాద్‌ వసీమ్‌ (46 నాటౌ ట్‌) రాణించారు. కుల్దీప్‌, విజయ్‌ శంకర్‌, హార్దిక్‌ పాండ్యాలకు రెండేసి వికెట్లు తీశారు.

Story first published: Monday, June 17, 2019, 13:59 [IST]
Other articles published on Jun 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+