న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌.. భారత క్రికెటర్లకు రెండు రోజుల విశ్రాంతి

ICC Cricket World Cup 2019 : Team India To Take Two Days Break After Defeating pak| Oneindia Telugu
ICC Cricket World Cup 2019, India vs Pakistan: Indian Team will rest for two days after defeating Pakistan

ప్రపంచకప్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత క్రికెటర్లకు రెండు రోజుల విశ్రాంతి లభించింది. టీమిండియా ఆటగాళ్లకు రెండు రోజుల పాటు విరామం ఇవ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయించింది. టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌ను శనివారం అఫ్గానిస్థాన్‌తో ఆడనుంది. మ్యాచ్‌కు మధ్యలో ఐదు రోజుల విరామం ఉండడంతో రెండు రోజులు ప్రాక్టీస్‌ నుంచి ఆటగాళ్లను మినహాయించాలని జట్టు యాజమాన్యం నిర్ణయించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

జట్టు యాజమాన్యం నిర్ణయంతో సోమ, మంగళవారాల్లో ఆటగాళ్లకు ప్రాక్టీస్‌ కూడా లేదు. భారత ఆటగాళ్లు ఈ రెండు రోజుల్లో నచ్చిన చోట విహరించే అవకాశం కల్పించారు. దీంతో విరామంలో సరదాగా గడిపేందుకు అందరూ సిద్ధమయ్యారు. ఆదివారం పాక్‌పై అద్భుత విజయం అనంతరం టీమిండియాలో ఫుల్ జోష్‌లో ఉంది. ఇక విశ్రాంతి కూడా లభించడంతో ఈ జోష్‌ మరింత ఎక్కువైంది.

భారత్ తన తదుపరి మూడు మ్యాచ్‌లను ఆఫ్గనిస్తాన్ (జూన్ 22), వెస్టిండీస్ (జూన్ 27), ఇంగ్లాండ్ (జూన్ 30)లతో ఆడనుంది. స్టార్ పేసర్ భువనేశ్వర్‌కు ఎడమ తొడకండరాలు పట్టేయడంతో ఈ మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. భువీ స్థానంలో షమీ జట్టులోకి రానున్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా చేతి వేలి గాయం కారంగా కారణంగా దూరమయిన విషయం తెలిసిందే. భారత్ మూడు మ్యాచ్‌లలో విజయం సాధిస్తే సెమీస్ చేరుకుంటుంది.

ఆదివారం మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్‌ శర్మ (140) భారీ శతకం.. కోహ్లీ (77), రాహుల్‌ (57) హాఫ్‌ సెంచరీలు చేయడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 336 పరుగులు చేసింది. పాక్ పేసర్ ఆమిర్‌కు మూడు వికెట్లు తీసాడు. లక్ష్య ఛేదనలో పాక్ తడబడింది. అయితే స్కోర్ 166/6 వద్ద వర్షం పడడంతో పాక్‌ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302 పరుగులుగా నిర్ణయించారు. కానీ పాక్‌ ఆరు వికెట్లకు 212 పరుగులే చేసి ఓడింది. ఫఖర్‌ జమాన్‌ (62), బాబర్‌ ఆజమ్‌ (48), ఇమాద్‌ వసీమ్‌ (46 నాటౌ ట్‌) రాణించారు. కుల్దీప్‌, విజయ్‌ శంకర్‌, హార్దిక్‌ పాండ్యాలకు రెండేసి వికెట్లు తీశారు.

Story first published: Tuesday, June 18, 2019, 10:57 [IST]
Other articles published on Jun 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X