Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌-పాక్ మ్యాచ్.. కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్‌ (వీడియో)

ICC Cricket World Cup 2019, India vs Pakistan: Indian Captain Virat kohli bating practice in Manchester nets

ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చిరకాల ప్రత్యర్ధులు భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్ అభిమానులు. మరోవైపు ఇరు జట్ల ఆటగాళ్లు కూడా ఈ మ్యాచ్ సవాల్‌తో కూడుకున్నది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ నేపథ్యంలో శనివారం ఇరు జట్ల ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా క‌స‌ర‌త్తులు చేశాయి. ముఖ్యంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నెట్స్‌లో చమటోడ్చాడు. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షం తగ్గుముఖం పట్టడంతో.. టీమిండియా ప్లేయ‌ర్లు ఔట్‌ డోర్‌లో ప్రాక్టీసు చేశారు. శ‌నివారం ఉద‌యం మాంచెస్ట‌ర్ మైదానంలో ఉన్న నెట్స్‌లో కోహ్లీ ప్రాక్టీసు చేశారు. కోహ్లీ గంట‌ల త‌ర‌బ‌డి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. స్పీడ్, స్పిన్నర్ల బౌలింగ్‌లో షాట్స్ ఆడారు. విజయ్ శంకర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడారు.

పక్కనే ఉన్న నెట్స్‌లలో కేఎల్ రాహుల్‌, రోహిత్‌ శర్మ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. జడేజా ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయగా.. హార్దిక్ త్రోలు ప్రాక్టీస్ చేశారు. మరోవైపు పాకిస్థాన్ మాత్రం వాతావ‌ర‌ణం స‌రిగా లేకపోవడంతో ఇండోర్ నెట్స్‌లోనే ప్రాక్టీసు చేసింది. పాక్ బ్యాట్స్‌మెన్ ఎక్కువ‌గా నెట్స్‌లో షార్ట్‌ పిచ్ బంతుల‌ను ప్రాక్టీస్ చేశారు. పాక్ ప్లేయ‌ర్లు బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ కూడా బాగా ప్రాక్టీస్ చేశారు. వీటికి సంబందించిన వీడియోలకు రమీజ్ రాజా తనదైన స్టయిల్లో కామెంటేటరీ చేసాడు. ఈ వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Story first published: Sunday, June 16, 2019, 13:56 [IST]
Other articles published on Jun 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+