Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భువనేశ్వర్‌కు గాయం.. రెండు లేదా మూడు మ్యాచ్‌లకు దూరం

ICC Cricket World Cup 2019 : Kohli Says Shami Will Replace Injured Bhuvneshwar Kumar || Oneindia
ICC Cricket World Cup 2019, India vs Pakistan: Captain Virat Kohli confirms Bhuvneshwar Kumar ruled out of next 2-3 games due to hamstring niggle

భారత స్టార్ పేసర్ భువనేశ్వర్‌ కుమార్ గాయం కారణంగా రెండు లేదా మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నాడని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు. ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌ వేదికగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

భువీ దూరం:

భువీ దూరం:

'భువనేశ్వర్‌కు ఎడమ తొడకండరాలు పట్టేసాయి. అతను రెండు లేదా మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అయితే టోర్నీ కీలక సమయంలో జట్టులోకి వస్తాడు. అతను జట్టుకు చాలా ముఖ్యం. భువీ స్థానంలో షమీ జట్టులోకి వస్తాడు' అని కోహ్లీ తెలిపారు. పాకిస్థాన్ మ్యాచ్‌లో 5వ ఓవర్‌లో 4 బంతులు వేసిన అనంతరం భువనేశ్వర్ గాయం కారణంగా డగౌట్ చేరుకున్నాడు. మళ్లీ అతను బౌలింగ్‌కు రాలేదు. భారత్ తన తదుపరి మూడు మ్యాచ్‌లను ఆఫ్గనిస్తాన్ (జూన్ 22), వెస్టిండీస్ (జూన్ 27), ఇంగ్లాండ్ (జూన్ 30)లతో ఆడనుంది.

రోహిత్ అత్యుత్తమ ఇన్నింగ్స్‌:

'భారత ఇన్నింగ్స్‌ సగం పూర్తయ్యాక బంతి స్పిన్‌ తిరగడం మొదలైంది. ఇది బౌలర్లకు సానుకూలాంశం. టాస్‌ గెలిస్తే బౌలింగే తీసుకునేవాళ్లం. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లలో బాగా ఆడాం. రోహిత్‌ శర్మ మొదటి మ్యాచ్‌లో వన్ మ్యాన్ షో చేసాడు. రెండో మ్యాచ్‌లో అందరం రాణించాం. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ మరోసారి అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడాడు. రాహుల్‌ ఉత్తమ వన్డే ఆటగాడినని చాటాడు. పాండ్యా చివర్లో బాగా ఆడాడు. మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంది' అని కోహ్లీ పేర్కొన్నారు.

ఆ బంతి అద్భుతం:

ఆ బంతి అద్భుతం:

'బాబర్‌ ఆజంను కుల్దీప్‌ యాదవ్‌ ఔట్‌ చేసిన బంతి అద్భుతం. అతను సుదీర్ఘ స్పెల్ బాగా వేసాడు. ఇంగ్లాండ్ పిచ్‌లపై కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. చహల్ కూడా మాకు చాలా కీలకం. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో ఓడిపోయాం అని.. ఈ మ్యాచ్‌ను భావోద్వేగంతో తీసుకుంటే చేదు ఫలితం రావొచ్చు. అందుకని ఆ ఓటమి గురించి ఆలోచించలేదు. ఆటలో ఇలాంటివి సహజమే అని భావించి ముందుకెళ్లాం. దానికి తగిన ఫలితం వచ్చింది' అని కోహ్లీ చెప్పుకొచ్చారు.

Story first published: Monday, June 17, 2019, 11:09 [IST]
Other articles published on Jun 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+