Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్-పాక్ మ్యాచ్.. కోహ్లీని కౌగిలించుకున్న సినీనటి

ICC Cricket World Cup 2019, India vs Pakistan: Bollywood Actress Urvashi Rautela gets trolled for posing with Virat Kohlis statue

క్రికెట్‌ మ్యాచ్‌లను ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. క్రికెట్‌కు సినీ తారలు, ప్రముఖులు మినహాయింపేమీ కాదు. తమ జట్టు గెలవాలని అందరూ మైదానంకు వెళ్లి మరీ ప్రోత్సహిస్తుంటారు. ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ చాలామంది ప్రముఖులు వివిధ మ్యాచ్‌లకు హాజరై తమ అభిమాన జట్లకు మద్దతు తెలుపుతున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రముఖుల సందడి:

ప్రముఖుల సందడి:

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడింది. ఈ మ్యాచ్‌కు అంబానీ కుటుంబం, రణవీర్ సింగ్, మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వారు మైదానానికి వెళ్లి టీమిండియాకు మద్దతు తెలిపారు. రణవీర్ సింగ్ అయితే ఏకంగా కామెంటరీ కూడా చెప్పాడు. అంతేకాదు శిఖర్ ధావన్ తో కలిసి సందడి కూడా చేసాడు.

కోహ్లీని కౌగిలించుకున్న ఊర్వశీ:

క్రికెట్ అంటే పిచ్చి ఉన్న బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా కూడా భారత ఆటగాళ్లు పరుగుల వరద పాటిస్తుంటే తెగ ఎంజాయ్ చేసింది. హోరా హోరీగా జరిగిన ఈ పోరులో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని చూసిన ఊర్వశీ.. ఆనందంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ విగ్రహాన్ని కౌగిలించుకుంది. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టడంతో కోహ్లీని నిజంగానే కౌగిలించుకుందా! అని నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు.

అనుష్కా.. ఎక్కడున్నావ్:

అనుష్కా.. ఎక్కడున్నావ్:

ఈ ఫొటోపై నెటిజన్స్ కామెంట్స్ కురిపిస్తున్నారు. విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ హెరాయిన్ అనుష్క శర్మను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 'అనుష్కా.. ఎక్కడున్నావ్.. ఇక్కడేదో జరుగుతోంది', 'అనుష్క నీకు అన్యాయం జరుగుతోంది', 'అనుష్క గివ్ రెస్పాన్స్' అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

టీమిండియా ఘన విజయం:

టీమిండియా ఘన విజయం:

ఈ మ్యాచ్‌లో వర్షం అడ్డుగా మారినా చివరకు 89 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఓపెనర్‌ 'హిట్ మ్యాన్‌' రోహిత్‌ శర్మ సెంచరీ (140; 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) చేయగా.. విరాట్‌ కోహ్లీ (77; 65 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. కుల్దీప్ యాదవ్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యాలు తలో రెండు వికెట్లు తీశారు.

Story first published: Wednesday, June 19, 2019, 13:36 [IST]
Other articles published on Jun 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+