
ఇది పాకిస్థాన్‌పై భారత్ మరో స్ట్రైక్ అని కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో భారత విజయంపై అమిత్ షా ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.
'పాకిస్థాన్‌పై భారత్ మరో స్ట్రైక్ చేసింది. మళ్లీ అదే ఫలితం వచ్చింది. మంచి ప్రదర్శన చేసిన టీంఇండియాకు అభినందనలు. మీ విజయంతో ప్రతీ భారతీయుడు గర్వపడుతూ సంబరాలు చేసుకుంటున్నారు' అని షా రాసుకొచ్చారు.
అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు భారత విజయంపై ప్రశంసల వర్షం కురిపిస్తూ అభినందనలు తెలుపుతున్నారు. 'పాకిస్థాన్‌పై గెలిచిన టీమిండియాకు అభినందనలు. ఈ విజయం కోసం కోహ్లీ సేన అద్భుత ఆటతీరు ప్రదర్శించింది' అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
'ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై మరో అద్భుత విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు. ఈ ప్రపంచకప్‌లో ఆడబోయే అన్ని మ్యాచ్‌లకు కోహ్లీ సేనకు శుభాకాంక్షలు' కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.
అద్భుత విజయం సాధించిన టీమిండియాకి అభినందనలు' అని కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.
'పాకిస్థాన్‌పై మంచి విజయం సాధించిన టీమిండియాకు శుభాకాంక్షలు. మరోసారి దేశం గర్వపడేలా చేశారు' అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.
'పాకిస్థాన్‌పై ఘన విజయాన్ని అందుకున్న టీమిండియాకు అభినందనలు. ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేశారు' అని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ అన్నారు.