షాట్లు ఆడమని యువరాజ్ ఎప్పుడైనా చెప్పాడా?.. భారత్ ఓటమికి ధోనీయే కారణం

ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా ఓటమికి వికెట్‌కీపర్ ఎంఎస్ ధోనీయే కారణమని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ ఆరోపించారు. లక్ష్య ఛేదనలో భారత్ చివరివరకు పోరాడి 18 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. కీలక సమయంలో రవీంద్ర జడేజా (77; 59 బంతుల్లో 4x4, 4x6), ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1x6) ఔట్ అవ్వడం మ్యాచ్‌పై ప్రభావం చూపింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

జడేజా భారీ షాట్లు ఆడాడు:
తాజాగా యోగ్‌రాజ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ... 'కీలక సమయంలో రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కు వచ్చి ఏ మాత్రం ఆందోళనకు గురికాకుండా, భయం లేకుండా భారీ షాట్లు ఆడాడు. మరో ఎండ్‌లో ఉన్న నువ్వు నెమ్మదిగా బ్యాటింగ్ చేశావు. జడేజా 77 పరుగుల వద్ద ఉన్నప్పుడు ధాటిగా బ్యాటింగ్ చేయమని చెప్పావు. అంతకుముందు హార్దిక్ పాండ్యని స్పిన్నర్లపై దాడి చేయమని చెప్పావు' అని యోగ్‌రాజ్ మండిపడ్డాడు.

ఎలా ఆడాలో తెలియదా:
'మిస్టర్ మహేంద్రసింగ్ ధోనీ ఇప్పటికే చాలా క్రికెట్ ఆడావు. ఎలా ఆడాలో ఎలా ఆడకూడదో ఆమాత్రం తెలియదా?. నీలా యువరాజ్ ఎప్పుడైనా వేరే ఆటగాళ్లకి అలా ఆడమని చెప్పాడా?. మంచి బంతులు పడ్డప్పుడు నువ్వెందుకు సిక్సులు కొట్టలేకపోయావు?. అప్పుడు నీకు ఆందోళన లేదా?. నువ్వు ముందే ఔటైనా ఫలితంలో పెద్ద తేడా ఉండేది కాదు. భారత్ ఓటమికి నువ్వే కారణం' అని యోగ్‌రాజ్ విమర్శించాడు. ధోనీని యోగ్‌రాజ్ విమర్శించడం ఇది తొలిసారి ఏం కాదు. గతంలో చాలా సార్లు విమర్శించినా.. ధోనీ మాత్రం ఎప్పుడూ కూడా యోగ్‌రాజ్‌ను ఏమీ అనలేదు. యువరాజ్‌ను జట్టు నుండి ధోనీ తప్పించాడని యోగ్‌రాజ్ కోపంగా ఉన్న విషయం తెలిసిందే.

ధోనీ రనౌట్:
లక్ష్య ఛేదనలో భారత్ విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు కావాలి. ఈ దశలో ధోనీ, భువనేశ్వర్ క్రీజులో ఉన్నారు. ఫెర్గుసన్ వేసిన 49 ఓవర్ మొదటి బంతిని ధోనీ సిక్స్ కొట్టాడు. రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతిని షాట్ ఆడిన ధోనీ.. రెండో పరుగుకు యత్నించగా కివీస్ ఫీల్డర్ మార్టిన్ గప్తిల్ విసిరిన డైరెక్ట్ త్రో బెయిల్స్‌కు తాకడంతో ధోనీ పెవిలియన్ చేరాడు. ఈ డైరెక్ట్ త్రోనే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. కివీస్ ఫైనల్ చేరింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications