ధోనీ రిటైర్మెంట్‌పై కోహ్లీ ఏమన్నాడంటే!!

మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ భారత క్రికెట్‌లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన ధోనీ.. గత కొంతకాలంగా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్-2019 అనంతరం రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ ఊహించారు. కప్ గెలిచి ధోనీ ఘనంగా వీడ్కోలు తీసుకోవాలని అభిమానులు ఆశించారు. కానీ సెమీస్‌లోనే భారత్ ఇంటిదారి పట్టింది. రిటైర్మెంట్ ప్రకటించడం లాంఛనమే అయినా.. ధోనీ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
బుధవారం న్యూజిలాండ్‌తో సెమీస్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ధోనీ రిటైర్మెంట్ గురించి ఓ విలేకరి అడగగా... ధోనీ రిటైర్మెంట్ గురించి తమకేమీ చెప్పలేదని, ధోనీ రిటైర్మెంట్‌పై తన దగ్గర ఏ సమాచారం లేదని సమాధానమిచ్చాడు. దీంతో ధోనీ రిటైర్మెంట్ విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు.
బుధవారం మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 18 పరుగులతో ఓడిపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కివీస్ వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. లక్ష్య ఛేదనలో ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1x6) జడేజాతో (77; 59 బంతుల్లో 1x4, 1x6) కలిసి పోరాడినా మ్యాచ్ చేజారింది. ఈ ప్రపంచకప్‌లో భారత జట్టును ధోనీ చాలా సార్లే ఆదుకున్నాడు. అయితే స్ట్రైక్ రేట్ విషయంలో మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ మ్యాచుతో ధోనీ ధాటిగా బ్యాటింగ్ చేయకపోవడంతో రిటైర్మెంట్‌పై ఒత్తిడి పెరిగింది. మరి ధోనీ ఎప్పుడు రిటైర్మెంట్ ఇస్తాడో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications