Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెమీస్ మ్యాచ్‌కు ముందు భార్య అనుష్క శ‌ర్మ‌తో కోహ్లీ చ‌క్క‌ర్లు

ICC Cricket World Cup 2019, India vs New Zealand: Virat Kohlis Day Out With Anushka Sharma Ahead of Semi-final Match

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచకప్‌ సెమీస్ మ్యాచ్‌కు ముందు భార్య, బాలీవుడ్ నటి అనుష్క శ‌ర్మ‌తో మాంచెస్ట‌ర్ వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టాడు. శ‌నివారం శ్రీలంక‌తో జ‌రిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం అనంతరం అంటే.. ఆదివారం రోజున కోహ్లీ త‌న భార్య అనుష్క శ‌ర్మ‌తో కలిసి సరదా సమయం గడిపాడు. ఆదివారంను త‌న భార్య‌కు అంకితం ఇచ్చాడు. బిజీ షెడ్యూల్ ఉన్నా.. దొరికిన కొద్ది సమయాన్ని ఆమె కోసం వెచ్చించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

విరుష్క జంట‌ మాంచెస్ట‌ర్ వీధుల్లో సంద‌డి చేసింది. సైడ్ సీయింగ్‌కు వెళ్లిన ఈ జంట అభిమానుల‌ను థ్రిల్ చేసింది. కొంద‌రు ఫ్యాన్స్ ఈ ఇద్ద‌రితో ఫోటోలు, సెల్ఫీలు దిగారు. వారికి కోహ్లీ ఆటో గ్రాఫ్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఫ్యాన్స్‌తో దిగిన సెల్ఫీలు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు తెగ షేర్ చేస్తూ సంబరపడిపోతున్నారు. ఈ పోటీలను అనుష్క తన ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది.

సైడ్ సీయింగ్‌లో విరుష్క జంట‌ కొత్త లుక్‌లో అదరగొట్టారు. విరాట్ గ్రే టీష‌ర్ట్‌లో, అనుష్క శర్మ బ్లాక్ అవుట్‌ఫిట్‌, వైట్ స్నీక‌ర్‌లో మాంచెస్ట‌ర్ వీధుల్లో క‌నువిందు చేశారు. అనుష్క శ‌ర్మ‌ తాజాగా లండన్ వచ్చింది. లంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అనుష్క స్టేడియం స్టాండ్స్ నుంచి సందడి చేస్తూ.. టీమిండియాకు మద్దతు చెప్పింది. మరోవైపు ఓపెనర్ రోహిత్ శర్మ భార్య రితిక కూడా సందడి చేసిన విషయం తెలిసిందే. మాంచెస్టర్‌లో మరోకొద్ధి సేపట్లో జరగనున్న భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య సెమీఫైనల్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు.

Story first published: Tuesday, July 9, 2019, 13:33 [IST]
Other articles published on Jul 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+