న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముగిసిన న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్.. భారత్ లక్ష్యం 240

ICC Cricket World Cup 2019 : Brendon McCullum, Kevin Pietersen Engage In Banter Over 1st S/F Target
ICC Cricket World Cup 2019, India vs New Zealand Semi Final: New Zealand score 239/8, India Target is 240

మాంచెస్టర్‌ వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మొదలైన మొదటి సెమీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్ ముగిసింది. న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసి.. భారత్ ముందు 240 పరుగుల లక్ష్యంను ఉంచింది. భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి న్యూజిలాండ్‌ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.

భువనేశ్వర్‌ మాయ:

భువనేశ్వర్‌ మాయ:

బుధవారం అదే స్కోర్ వద్ద మ్యాచ్ ప్రారంభం అయింది. భువీ తన బౌలింగ్ కొనసాగించాడు. బుమ్రా వేసిన 48 ఓవర్లో రాస్‌ టేలర్‌ (74; 90 బంతుల్లో 3×4, 1×6) రనౌట్‌ అయ్యాడు. రవీంద్ర జడేజా అద్భుతమైన త్రోకు టేలర్‌ పెవిలియన్ చేరాడు. భువనేశ్వర్‌ వేసిన 48.1వ బంతిని భారీ షాట్‌ ఆడిన టామ్‌ లేథమ్‌ (10; 11 బంతుల్లో) ఔటయ్యాడు. మళ్లీ రవీంద్ర జడేజా అద్భుతంగా క్యాచ్ పట్టాడు. చివరి బంతికి భారీ షాట్‌ ఆడబోయి మాట్‌ హెన్రీ (1; 2 బంతుల్లో) ఔటయ్యాడు.

23 బంతుల్లో 28 ర‌న్స్:

23 బంతుల్లో 28 ర‌న్స్:

ఆఖరి ఓవర్‌లో బుమ్రా 7 పరుగులు ఇచ్చాడు. శాంట్నర్‌ (9; 6 బంతుల్లో 1×4), ట్రెంట్‌ బౌల్ట్‌ (3; 3 బంతుల్లో) అజేయంగా నిలిచారు. రిజ‌ర్వ్‌డే రోజున 23 బంతుల్లో న్యూజిలాండ్ మ‌రో మూడు వికెట్లు కోల్పోయి 28 ర‌న్స్ జోడించింది. భార‌త బౌల‌ర్లలో బుమ్రా (1/39), భువ‌నేశ్వ‌ర్‌ (3/43)లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసారు. పాండ్యా, జడేజా, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు. ఫీల్డింగ్లో ర‌వీంద్ర జ‌డేజా ఇవాళ కూడా త‌న టాలెంట్ చూపించాడు.

రెండు ఓవర్లు మెయిడిన్‌:

రెండు ఓవర్లు మెయిడిన్‌:

మంగళవారం టాస్‌ గెలిచిన విలియమ్సన్‌ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే కివీస్ అంచనాలను భారత బౌలర్లు అంచనాలను తలక్రిందులు చేశారు. భువనేశ్వర్‌, జస్ప్రీత్‌ బుమ్రాలు తొలి రెండు ఓవర్లను మెయిడిన్‌ వేశారు. ఒక్క పరుగు వద్దే ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ (1; 14 బంతుల్లో)ను బుమ్రా ఔట్‌ చేసి కివీస్‌కు షాక్‌ ఇచ్చాడు.

కెప్టెన్ ఇన్నింగ్స్:

కెప్టెన్ ఇన్నింగ్స్:

మరో ఓపెనర్ హెన్రీ నికోలస్‌ (28; 51 బంతుల్లో 2×4)తో కలిసి కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ (67; 95 బంతుల్లో 6×4) ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. ఇద్దరు వేగంగా పరుగులు చేయలేకపోయినా.. ఆచితూచి ఆడాడు. 50 పరుగుల భాగస్వామ్యం అనంతరం ఓ అద్భుతమైన బంతితో నికోలస్‌ను జడేజా క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ (67నాటౌట్‌; 85 బంతుల్లో 3×4, 1×6)తో కలిసి విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ ముందుకు నడిపాడు. ఈ క్రమంలోనే విలియమ్సన్‌ అర్ధ శతకం చేసాడు.

టేలర్‌ దూకుడు:

టేలర్‌ దూకుడు:

వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. అయితే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్‌ 29 ఓవర్లకు గానీ 100 పరుగులు దాటలేదు. మరోవైపు అర్ధ శతకం తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో చాహల్‌ బౌలింగ్‌లో విలియమ్సన్‌ ఔటయ్యాడు. 134 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కివీస్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో జేమ్స్‌ నీషమ్‌ (12; 18 బంతుల్లో 1×4) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత గ్రాండ్‌హోమ్‌ (16; 10 బంతుల్లో 2×4)తో కలిసి టేలర్‌ దూకుడుగా ఆడుతూ అర్ధ శతకం అందుకున్నాడు. ఇక ఇన్నింగ్స్ ఊపందుకునే సమయంలో వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్‌ ఆగిపోయింది.

Story first published: Wednesday, July 10, 2019, 16:01 [IST]
Other articles published on Jul 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X