For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌ vs న్యూజిలాండ్‌ మ్యాచ్.. తొలి వికెట్‌కీపర్‌గా ధోనీ ప్రపంచ రికార్డు

ICC Cricket World Cup 2019 : MS Dhoni Playing His 350th ODI As A Wicket Keeper In World Cup
ICC Cricket World Cup 2019, India vs New Zealand semi-final: MS Dhoni only the second Indian after Sachin Tendulkar play 350 ODIs

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్‌కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్‌ 2019 టోర్నీ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఎంఎస్ ధోనీకి 350 వన్డే. దీంతో 350 వన్డేలాడిన తొలి వికెట్‌కీపర్‌గా ధోనీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 360 మ్యాచ్‌లకు కీపర్‌గా వ్యవహరించినప్పటికీ.. అందులో 40వన్డేలలో స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా ఆడాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

350 వన్డే ఆడుతున్న ధోనీ ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది. టీమిండియా మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (463) తర్వాత 350 వన్డేలు ఆడిన భారత క్రికెటర్‌గా ధోనీ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా పదో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ధోనీ కన్నా ముందు మహేలా జయవర్ధనే (448), సనత్‌ జయసూర్య (445), కుమార సంగక్కర (404), షాహిద్‌ అఫ్రిది (398), ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ (378), రికీ పాంటింగ్‌ (375), వసీం అక్రమ్‌ (356), ముత్తయ్య మురళీథరన్‌ (350) వరుసగా ఉన్నారు.

ఈ ప్రపంచకప్‌లో ధోనీ పరుగులు చేస్తున్నా.. స్లో బ్యాటింగ్‌తో విమర్శలు ఎదుర్కొన్నాడు. తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో మాజీలు సైతం విమర్శలు గుప్పించారు. ఎప్పుడూ కూడా విమర్శలకు తన బ్యాటింగ్‌తో సమాధానమిచ్చే ధోనీ.. కివీస్‌తో మ్యాచ్‌లో చెలరేగనున్నాడు. అభిమానులు కూడా ఇదే ఆశిస్తున్నారు.

భారత్‌పై టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు ఆదిలోనే షాక్ తగికింది. కేవలం ఒక్క పరుగు స్కోరుకే న్యూజిలాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ (1) బుమ్రా బౌలింగ్‌లో కెప్టెన్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ హెన్రీ నికోల్స్, కెప్టెన్ కేన్ విలియమ్సన్‌లు జట్టును ఆదుకున్నారు. ఈ జోడి అర్ధ శతక భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రస్తుతం క్రీజులో హెన్రీ నికోల్స్ (23), విలియమ్సన్‌ (26) ఉన్నారు. 14 ఓవర్లకు న్యూజిలాండ్‌ ఒక వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది.

Story first published: Tuesday, July 9, 2019, 17:57 [IST]
Other articles published on Jul 9, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+