Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెమీస్‌ మ్యాచ్‌.. కోహ్లీ సేనకు సచిన్‌ కీలక సూచన

ICC Cricket World Cup 2019 : Sachin Advices Team India To Make These Two Changes Against New Zealand
ICC Cricket World Cup 2019, India vs New Zealand: Sachin Tendulkar weighs in on team selection, has an advice for Virat Kohli

ప్రపంచకప్‌ సమరం తుది అంకానికి చేరుకుంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ వేదికగా మంగళవారం భారత్‌, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరుగనుంది. బలబలాల పరంగా ప్రత్యర్థి కంటే ఎంతో మెరుగ్గా కనిపిస్తున్నభారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే భారత్ తుది జట్టుపై కొంత సందేహాలు నెలకొన్నాయి. కీలక మ్యాచ్ నేపథ్యంలో కోహ్లీ సేనకు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ కీలక సూచనలు చేసాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఎలాంటి మార్పులు చేయొద్దు:

ఎలాంటి మార్పులు చేయొద్దు:

తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ మాట్లాడుతూ... 'టీమిండియా ఆడుతున్న విధానాన్నే కొనసాగించాలని, సెమీస్‌లో ఎలాంటి మార్పులు చేయొద్దని' సచిన్ సూచించాడు. 'ఒకవేళ దినేశ్‌ కార్తిక్‌ ఏడో నంబర్‌లో బ్యాటింగ్‌ చేస్తే.. జడేజా బౌలింగ్‌లో ఉపయోగపడతాడు. ఎడమచేతి వాటం గల జడేజా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తాడు' అని సచిన్ పేర్కొన్నారు.

 షమీని ఆడించాలి:

షమీని ఆడించాలి:

'మాంచెస్టర్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్‌ షమీ అద్భుత ప్రదర్శన చేసాడు. కీలక సెమీస్ మ్యాచ్‌లో షమీని ఆడించాలని' సచిన్ అన్నారు. 'న్యూజిలాండ్‌ గతకొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ ఏమాత్రం తేలికగా తీసుకోవద్దు. టీమిండియా ఇప్పటికే ఫైనల్స్‌ చేరిందని భావించొద్దు. ప్రస్తుతం భారత జట్టు దృష్టంతా సెమీస్‌పైనే ఉంచాలని' సచిన్ అన్నారు.

ఒత్తిడిని తట్టుకొని నిలబడాలి:

ఒత్తిడిని తట్టుకొని నిలబడాలి:

'సెమీఫైనల్స్ లాంటి మ్యాచ్‌లో ఆటగాళ్లంతా ఒత్తిడికి గురౌతారు. కివీస్‌తో సెమీస్‌లోనూ తప్పకుండా ఉంటుంది. ఒత్తిడి సహజం. మీడియా, అభిమానుల ముందు ఆటగాళ్లు ఈ విషయాన్ని ఒప్పుకోరు. ప్రతి ఆటగాడు ఒత్తిడిని తట్టుకొని నిలబడాలి. అలాంటి ఆటగాళ్లు భారత జట్టులో చాలా మంది ఉన్నారు. అందరూ రాణిస్తారు' అని సచిన్ ఆశాభావం వ్యక్తం చేసాడు.

అదృష్టం కలిసొచ్చి:

అదృష్టం కలిసొచ్చి:

ఆడిన ఎనమిది మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో భారత్‌ ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీస్ చేరింది. టైటిల్‌ ఫేఫేవరెట్‌లలో ఒకరిగా బరిలోకి దిగిన భారత్‌ ప్రస్థానం సెమీఫైనల్‌ వరకు రాజసంగా సాగింది. ఆతిథ్య ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం, వర్షం కారణంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ రద్దు కావడం మినహా మిగతా ఏడు మ్యాచ్‌ల్లో భారత్‌ అదరగొట్టింది. మరోవైపు న్యూజిలాండ్ ప్రయాణం మాత్రం బిన్నంగా సాగింది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌కు పరాజయం ఎదురుకాలేదు. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో జరిగిన చివరి మూడు మ్యాచ్‌ల్లో కివీస్‌ జట్టుకు ఓటమి ఎదురైంది. ఇంగ్లండ్‌పై భారత్ గెలిచుంటే.. పాకిస్థాన్ సెమీస్ వచ్చేది. కానీ.. కివీస్‌కు అదృష్టం కలిసొచ్చి సెమీస్ చేరింది.

Story first published: Tuesday, July 9, 2019, 11:09 [IST]
Other articles published on Jul 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+