న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌..

ICC Cricket World Cup 2019 : India vs New Zealand || New Zealand Won Toss Choose Bat ! || Oneindia
ICC Cricket World Cup 2019, India vs New Zealand: New Zealand have won the toss and have opted to bat

ప్రపంచకప్‌ మెగా టోర్నీలో మరికాసేపట్లో ఆసక్తికర పోరు జరగబోతోంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ వేదికగా తొలి సెమీస్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడబోతున్నాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ బ్యాటింగ్ సెంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్‌ ఒక మార్పు చేసింది. సౌతీ స్థానంలో లుకీ ఫెర్గూసన్‌ జట్టులోకి వచ్చాడు. మరోవైపు భారత్ కూడా మార్పు చేసింది. కుల్‌దీప్‌ యాదవ్ స్థానంలో చహల్ వచ్చాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

గత కొన్ని మ్యాచ్‌లలో ఓల్డ్ ట్రఫోర్డ్ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. ఈ వికెట్ బ్యాటింగ్‌తో పాటు మ్యాచ్ సాగే కొద్ది పేస్‌కు అనుకూలిస్తుంది. అయితే భారీ స్కోర్లకు అవకాశం ఉంది. భారత్‌ ఇప్పటికే ఇక్కడ పాక్, విండీస్‌లపై గెలవగా.. కివీస్‌ చేతిలో విండీస్‌ త్రుటిలో ఓడింది. ప్రస్తుతానికైతే మ్యాచ్‌కు వర్షం ముప్పు కేవలం 5% మాత్రమే ఉందని తెలుస్తోంది.

ప్రపంచకప్‌లో భారత్, న్యూజిలాండ్‌ జట్లు ఏడు సార్లు తలపడ్డాయి. నాలుగు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ గెలిచింది. మూడు మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం సాధించింది. ఈ రెండు జట్లు 2003 తర్వాత మళ్లీ ఓ ప్రపంచకప్‌ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. 2003 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ ఏడు వికెట్లతో గెలిచింది.

ఈ సెమీఫైనల్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు. గెలిచిన జట్టు ఫైనల్స్‌కి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ టీంఇండియా గెలవాలని ప్రతి ఒక్క భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియానే హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

జట్లు:
భారత్‌
: రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్‌, ఎంఎస్ ధోనీ, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యజువేంద్ర చహల్, భువనేశ్వర్‌ కుమార్, జస్ప్రీత్ బుమ్రా.

న్యూజిలాండ్‌: మార్టిన్ గప్తిల్‌, హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్‌ (కెప్టెన్), రాస్ టేలర్‌, టామ్ లేథమ్‌, జిమ్మీ నీషమ్‌, కొలిన్ గ్రాండ్‌హోమ్‌, మిచెల్ శాంట్నర్‌, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్‌, లుకీ ఫెర్గూసన్‌.

1
43689

{headtohead_cricket_3_4}

Story first published: Tuesday, July 9, 2019, 14:45 [IST]
Other articles published on Jul 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X