న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2008 సెమీస్ ఓటమి.. కోహ్లీపై ప్రతీకారం తీర్చుకున్న విలియమ్సన్

ICC Cricket World Cup 2019:India v New Zealand : Williamson Gets Revenge On Kohli For 2008 Semi Loss
ICC Cricket World Cup 2019, India vs New Zealand: New Zealand captain Kane Williamson gets revenge on Indian Virat Kohli for 2008 semi final loss


ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా చివరి వరకు పోరాడి 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మరోవైపు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన విలియమ్సన్ సేన.. అద్భుత విజయం సాధించి వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరింది. ఈ విజయంతో 2008 అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీస్ ఓటమికి కివీస్‌ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రతీకారం తీర్చుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

 కెప్టెన్ ఇన్నింగ్స్:

కెప్టెన్ ఇన్నింగ్స్:

2008 అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీస్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసి.. భారత్‌కు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విలియమ్సన్‌ 37 పరుగులు చేశారు. ఆ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్‌ లక్ష్యం 43 ఓవర్లలో 191 పరుగులుగా మారింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ గోస్వామితో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ (43) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ 7 వికెట్లు కోల్పోయి 9 బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఇక ఫైనల్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.

అప్పటి ఓటమికి ప్రతీకారం:

అప్పటి ఓటమికి ప్రతీకారం:

2008లో విలియమ్సన్‌ సేనను ఓడించి కోహ్లీ సేన ఫైనల్‌కు చేరితే.. ప్రస్తుత ప్రపంచకప్‌ సెమీస్‌లో కోహ్లీ సేనను ఓడించి విలియమ్సన్‌ సేన ఫైనల్‌కు చేరింది. దీంతో 2008 అండర్‌-19 ప్రపంచకప్‌ ఓటమికి విలియమ్సన్‌ ప్రతీకారం తీర్చుకున్నాడు. రెండు సెమీస్‌లోనూ వర్షం పడటం విశేషం. కోహ్లీ అప్పుడు కప్‌ను అందుకున్నట్లు.. విలియమ్సన్ కూడా కప్ అందుకుంటాడో చూడాలి. గురువారం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో న్యూజిలాండ్ ఆదివారం తలపడనుంది.

విలియమ్సన్‌దే పైచేయి:

విలియమ్సన్‌దే పైచేయి:

అండర్‌-19 ప్రపంచకప్‌లో కెప్టెన్లులా ఉన్న విరాట్‌ కోహ్లీ, కేన్ విలియమ్సన్‌లు జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. కోహ్లీ 2008లోనే జాతీయ జట్టుకు ఎంపికవగా.. విలియమ్సన్‌ 2010లో ఎంపికయ్యాడు. బ్యాటింగ్‌లో ఇద్దరూ ఎన్నో రికార్డులను అందుకున్నారు. టెస్టు, వన్డే ర్యాకింగ్స్‌లో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. విలియమ్సన్‌ టెస్టులో రెండో ర్యాంకు, వన్డేల్లో ఎనిమిదో ర్యాంకులో ఉన్నాడు. ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ కంటే విలియమ్సన్‌ ఎక్కువ మార్కులు కొట్టేసాడు. కష్టాల్లో పడిన జట్టును విలియమ్సన్‌ ప్రతిసారీ ఆదుకున్నాడు. సెమీస్‌లో కూడా విలియమ్సన్‌ అర్ధ శతకంతో రాణించగా.. కోహ్లీ ఒక పరుగుకే పెవిలియన్ చేరాడు. ఈ ప్రపంచకప్‌లో విలియమ్సన్‌ ఇప్పటికే 500 మార్క్ అందుకున్నాడు.

Story first published: Thursday, July 11, 2019, 14:23 [IST]
Other articles published on Jul 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X