For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెమీఫైనల్‌లో ధోనీ ఔట్.. అభిమాని మృతి

ICC Cricket World Cup 2019 : IND v NZ : Dhoni Fan Got Heart Strock After MS Dhoni Gets Run Out !
ICC Cricket World Cup 2019, India vs New Zealand: MS Dhoni Kolkata fan Srikanth dies after Dhoni out

ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా లెజెండ్ ఎంఎస్ ధోనీ ఔట్ అవ్వడం తట్టుకోలేక అతని అభిమాని మృతి చెందాడు. ఈ విషాద ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతా నగరంలో జరిగింది. వరుణుడి ప్రభావంతో దాదాపు 28 గంటల పాటు జరిగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించి రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది.

బాధను తట్టుకోలేక:

బాధను తట్టుకోలేక:

కోల్‌కతా నగరానికి చెందిన శ్రీకాంత్ (33) అనే వ్యక్తి సైకిల్ షాపు యజమాని. శ్రీకాంత్ ధోనీకి వీరాభిమాని. బుధవారం న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌ను శ్రీకాంత్ తన మొబైల్ ఫోన్‌లో చూస్తున్నాడు. మ్యాచ్ చివరలో అనూహ్యంగా ధోనీ రనౌట్ అయ్యాడు. ఫోన్‌లో మ్యాచ్ చూస్తున్న శ్రీకాంత్.. బాధను తట్టుకోలేక గట్టిగా అరుస్తూ సృహ తప్పి పడిపోయాడు. పక్కనవారు వెంటనే శ్రీకాంత్‌ను ఖానుకుల్ ఆసుపత్రికి తరలించారు. అయితే గుండె పోటుతో అప్పటికే శ్రీకాంత్‌ మరణించినట్లు వైద్యులు దృవీకరించారు.

ఆసుపత్రికి తీసుకెళ్ళాం

ఆసుపత్రికి తీసుకెళ్ళాం

'మేము శ్రీకాంత్‌ అరుపులు విని షాప్ దగ్గరికి వెళ్ళాం. అప్పటికే అతను నేలపై అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే శ్రీకాంత్‌ను ఆసుపత్రికి తీసుకెళ్ళాం. వైద్యులు పరీక్షించి అతను చనిపోయాడని ప్రకటించారు. శ్రీకాంత్‌కు ధోనీ అంటే చాలా ఇష్టం' అని పక్కనే ఉండే ఓ స్వీట్ షాప్ యజమాని తెలిపారు.

కీలక సమయంలో రనౌట్‌:

కీలక సమయంలో రనౌట్‌:

లక్ష్య ఛేదనలో కివీస్ బౌలర్ల దాటికి భారత బ్యాట్స్‌మన్‌ వరుసగా పెవిలియన్ చేరారు. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కొద్దిసేపు పోరాడినా.. చెత్త షాట్లు ఆడి ఔట్ అయ్యారు. 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (77; 59 బంతుల్లో 4x4, 4x6)తో కలిసి ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1X6) వందకుపైగా భాగస్వామ్యం నెలకొల్పి భారత శిబిరంలో ఆశలు రేపాడు. ఈ సమయంలో భారీ షాట్‌ ఆడబోయిన జడేజా ఔట్ అయ్యాడు. అనంతరం గెలిపించే బాధ్యత ధోనీపై పడగా.. కీలక సమయంలో ఓ సిక్స్ బాదిన అనంతరం రనౌట్‌ అయ్యాడు. ఇది చూసిన అభిమాని గుండె పోటుతో మరణించాడు.

Story first published: Thursday, July 11, 2019, 13:40 [IST]
Other articles published on Jul 11, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+