ధోనీని రనౌట్ చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నా: గప్తిల్

ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి సెమీ ఫైనల్లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. వరుసగా రెండోసారి సెమీఫైనల్ గండాన్ని దాటలేకపోయిన భారత్.. ప్రపంచకప్-2019లో తన ప్రస్థానంను సెమీస్‌తోనే ముగించింది. చివరి వరకు రేసులో ఉన్న భారత్.. కీలక సమయంలో మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1x6) రనౌట్ ఔట్ అవ్వడం మ్యాచ్‌పై ప్రభావం చూపింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

డైరెక్ట్ త్రో:
లక్ష్య ఛేదనలో భారత్ విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు కావాలి. ఈ దశలో ధోనీ, భువనేశ్వర్ క్రీజులో ఉన్నారు. ఫెర్గుసన్ వేసిన 49 ఓవర్ మొదటి బంతిని ధోనీ సిక్స్ కొట్టాడు. రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతిని షాట్ ఆడిన ధోనీ.. రెండో పరుగుకు యత్నించగా కివీస్ ఫీల్డర్ మార్టిన్ గప్తిల్ విసిరిన డైరెక్ట్ త్రో బెయిల్స్‌కు తాకడంతో ధోనీ పెవిలియన్ చేరాడు. ఈ డైరెక్ట్ త్రోనే మ్యాచ్‌ను మలుపు తిప్పింది.
అదృష్టంగా భావిస్తున్నా:
తాజాగా ఐసీసీ విడుదల చేసిన ఓ వీడియోలో మార్టిన్ గప్తిల్ మాట్లాడుతూ... 'ప్రపంచ అత్యుత్తమ ఫినిషర్ ధోనీని కీలక సమయంలో డైరెక్ట్ హిట్ చేశాను. ధోనీని రనౌట్ చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నా. ఇదే మ్యాచ్‌ను మలుపు తిప్పింది' అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో గప్తిల్ 14 బంతులు ఆడి కేవలం ఒక పరుగు మాత్రమే చేసాడు. భారత బౌలర్ బుమ్రా అతన్ని ఔట్ చేసాడు.

అభిమాని మృతి:
ఎంఎస్ ధోనీ ఔట్ అవ్వడం తట్టుకోలేక అతని అభిమాని మృతి చెందాడు. కోల్‌కతా నగరానికి చెందిన శ్రీకాంత్ (33) అనే వ్యక్తి సైకిల్ షాపు యజమాని. శ్రీకాంత్ ధోనీకి వీరాభిమాని. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌ను శ్రీకాంత్ తన మొబైల్ ఫోన్‌లో చూస్తున్నాడు. మ్యాచ్ చివరలో అనూహ్యంగా ధోనీ రనౌట్ అయ్యాడు. ఫోన్‌లో మ్యాచ్ చూస్తున్న శ్రీకాంత్.. బాధను తట్టుకోలేక గట్టిగా అరుస్తూ సృహ తప్పి పడిపోయాడు. పక్కనవారు వెంటనే శ్రీకాంత్‌ను ఖానుకుల్ ఆసుపత్రికి తరలించారు. అయితే గుండె పోటుతో అప్పటికే శ్రీకాంత్ మరణించినట్లు వైద్యులు దృవీకరించారు.

ఏ సమాచారం లేదు:
సెమీస్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ధోనీ రిటైర్మెంట్ గురించి ఓ విలేకరి అడగగా... ధోనీ రిటైర్మెంట్ గురించి తమకేమీ చెప్పలేదని, ధోనీ రిటైర్మెంట్‌పై తన దగ్గర ఏ సమాచారం లేదని సమాధానమిచ్చాడు. దీంతో ధోనీ రిటైర్మెంట్ విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications