Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్‌ను ఆపే బౌలరే లేడు.. భారత్ ఫైనల్స్‌కి వెళ్తుంది

ICC Cricket World Cup 2019: IND V NZ: India Already Have One Foot In The Final, Feels Michael Clarke
ICC Cricket World Cup 2019, India vs New Zealand: India already have one foot in the final feels Michael Clarke

భారత ఓపెనర్ రోహిత్ శర్మను అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతన్ని ఆపే బౌలరే లేడు. ప్రస్తుత ఫామ్‌ చూస్తుంటే భారత్‌ ప్రపంచకప్‌ ఫైనల్స్‌కి వెళ్తుంది అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ క్లార్క్‌ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌ టోర్నీలో ఫైన‌లిస్టులు ఎవ‌ర‌నేది ప్ర‌స్తుతం క్రికెట్ ప్ర‌పంచంలో అత్యంత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన గొప్ప‌, గొప్ప ఆట‌గాళ్లంద‌రూ ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌లిస్టులు ఎవ‌ర‌నే విష‌యంపై ఒక్కో ర‌కంగా జోస్యం చెబుతున్నారు. అందరూ కూడా భార‌త్‌ ఫైన‌ల్ ఆడ‌టం ఖాయ‌మ‌ని అంటున్నారు. తాజాగా ఈ జాబితాలో మైఖెల్‌ క్లార్క్‌ కూడా చేరిపోయాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఫైనల్‌ బెర్త్‌ భారత్‌దే:

ఫైనల్‌ బెర్త్‌ భారత్‌దే:

సెమీస్‌ మ్యాచ్‌ నేపథ్యంలో మీడియాతో మైఖెల్‌ క్లార్క్‌ మాట్లాడుతూ... 'భారత్‌ ఇప్పటికే ఫైనల్స్‌ కోసం ఒక అడుగు ముందుకేసింది. కచ్చితంగా ఫైనల్‌కు చేరుతుంది. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. భారత ఆటగాడినైతే నేను కూడా ఇలా ఆలోచించను. కానీ.. భారత్‌ ఫామ్‌ చూస్తుంటే ఆ జట్టు ఫైనల్‌ బెర్త్‌ ఖరారైంది' అని క్లార్క్‌ ధీమా వ్యక్తం చేసాడు.

తక్కువ అంచనా వేయొద్దు:

తక్కువ అంచనా వేయొద్దు:

'ప్రస్తుతం న్యూజిలాండ్‌ బలహీనంగా కనిపిస్తోంది. మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన కివీస్‌ జట్టులో ఆత్మవిశ్వాసం లోపించింది. ఇది వారికి కష్టాలను తేనుంది. భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. వరుస విజయాల ఉత్సాహం భారత్‌ను ఫైనల్‌కు చేరేలా చేస్తుంది. భారత్‌ ఎంత బాగా ఆడుతున్నా న్యూజిలాండ్‌ని తక్కువ అంచనా వేయొద్దని' క్లార్క్‌ సూచించాడు.

 రోహిత్‌ను ఆపే బౌలరే లేడు:

రోహిత్‌ను ఆపే బౌలరే లేడు:

భారత జట్టు విజయాల వెనుక రోహిత్‌ ప్రదర్శన ఉంది. ఊపుమీదున్న రోహిత్‌ను అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. అతన్ని ఆపే బౌలరే లేడు. రోహిత్, డేవిడ్‌ వార్నర్‌ టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడారు. రెండో సెమీస్ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాళ్లు శ్రమించాల్సిందే. బలమైన ఇంగ్లండ్ జట్టును నిలువరించాలంటే ఆసీస్ సమిష్టిగా రాణించాలి' అని క్లార్క్‌ అభిప్రాయపడ్డాడు. మరోకొద్ధి గంటల్లో జరగనున్న భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య సెమీఫైనల్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు.

Story first published: Tuesday, July 9, 2019, 12:54 [IST]
Other articles published on Jul 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+