
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. కివీస్ ఓపెనర్ బ్యాట్స్‌మన్ హెన్రీ నికోల్స్ (28; 51 బంతుల్లో 2×4) ఔటయ్యాడు. స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన 19 ఓవర్ 2వ బంతిని ఆడబోయిన నికోల్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతి బ్యాటు, ప్యాడ్ల మధ్యలోంచి వికెట్లను తాడకం గమనార్హం.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు ఆదిలోనే షాక్ తగికింది. కేవలం ఒక్క పరుగు స్కోరుకే న్యూజిలాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ (1) బుమ్రా బౌలింగ్‌లో కెప్టెన్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ హెన్రీ నికోల్స్, కెప్టెన్ కేన్ విలియమ్సన్‌లు జట్టును ఆదుకున్నారు.
ఈ జోడి అర్ధ శతక భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం జడేజా టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌పై భారత్ బౌలర్లు విరుచుకుపడుతున్నారు. వీరి దాటికి స్వేచ్ఛగా పరుగులు తీయలేకపోతున్నారు. ప్రస్తుతం క్రీజులో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (35), రాస్ టేలర్ (4)లు ఉన్నారు. 23 ఓవర్లకు న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. బుమ్రా, జడేజా తలో వికెట్ తీశారు.