న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

17 బంతులకు ఖాతా తెరిచిన కివీస్.. ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ ఔట్

ICC Cricket World Cup 2019, India vs New Zealand: Bumrah strikes early, Opnear Martin Guptil departs

ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్‌ 2019 టోర్నీ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు ఆదిలోనే షాక్ తగికింది. కేవలం ఒక్క పరుగు స్కోరుకే న్యూజిలాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ (1) బుమ్రా బౌలింగ్‌లో కెప్టెన్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు మార్టిన్ గప్తిల్‌, హెన్రీ నికోల్స్ ఆరంభించారు. టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వేసిన మొదటి ఓవర్ మొదటి బంతిని గప్తిల్ ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ ఆడాడు. దీంతో బాల్ అతని ప్యాడ్లకు తగిలింది. భరత ఆటగాళ్లు అప్పీల్ చేసినా.. అంపైర్ నాఔట్ ఇచ్చాడు. అయితే భారత్ రివ్యూ కోరగా.. డీఆర్‌ఎస్‌లో అది నాటౌట్ అని తేలింది. దీంతో భారత్ తన ఒక్క రివ్యూను కోల్పోయింది.

blockquote class="twitter-tweet blockquote" data-lang="en">

The pressure tells!

Jasprit Bumrah gets one to bounce and move away, Martin Guptill fends, and the thick edge flies to #ViratKohli at second slip.

What a start this has been from India!#INDvNZ | #CWC19 pic.twitter.com/vMUngjQWIO

— Cricket World Cup (@cricketworldcup) July 9, 2019

అనంతరం భువనేశ్వర్ మొదటి ఓవర్ మెయిడిన్‌ వేయగా.. యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా రెండో ఓవర్ మెయిడిన్‌ వేసాడు. మూడో ఓవర్లో భువీ ఒక పరుగు ఇచ్చాడు. ఇక బుమ్రా వేసిన 3.3వ బంతికి మార్టిన్‌ గప్తిల్‌ (1; 14 బంతుల్లో) ఔటయ్యాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌పై భారత్ బౌలర్లు విరుచుకుపడుతున్నారు. వీరి దాటికి కనీసం సింగిల్ కూడా తీయలేకపోతున్నారు. ముఖ్యంగా బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో హడలెత్తిస్తున్నారు. ప్రస్తుతం క్రీజులో హెన్రీ నికోల్స్ (3), విలియమ్సన్‌ (3) ఉన్నారు. 7 ఓవర్లకు న్యూజిలాండ్‌ ఒక వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది.

Story first published: Tuesday, July 9, 2019, 15:54 [IST]
Other articles published on Jul 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X