Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెమీ ఫైనల్.. టీమిండియాకు సైనా బెస్ట్ విషెస్

ICC Cricket World Cup 2019, India vs New Zealand: Badminton star Saina Nehwal Leads Wishes For India

ప్రపంచకప్‌ మెగా టోర్నీలో మరికాసేపట్లో ఆసక్తికర పోరు జరగబోతోంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ వేదికగా తొలి సెమీస్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడబోతున్నాయి. ఈ సెమీఫైనల్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు. గెలిచిన జట్టు ఫైనల్స్‌కి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

కీలక మ్యాచ్ నేపథ్యంలో ప్రముఖులు అందరూ టీమిండియాకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. ఇప్పటికే మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్, సౌరవ్ గుంగూలీ, లక్షణ్, కెవిన్‌ పీటర్సన్‌, మైఖేల్‌ క్లార్క్‌ లాంటి మాజీలు భారత్‌కు విషెస్ తెలిపారు. తాజాగా భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ట్విట్టర్ వేదికగా టీమిండియాకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. టీమిండియా ఆటగాళ్లు బాగా ఆడుతున్నార‌ని, కివీస్‌తో మ్యాచ్‌లో గెల‌వాల‌ని ఆమె ఆకాక్షించారు. భారత్ ఉత్త‌మ ఆట‌ను ప్ర‌ద‌ర్శిస్తుంద‌ని సైనా ఆశాభావం వ్య‌క్తం చేశారు.

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమా మాలిని కూడా టీమిండియాకు కంగ్రాట్స్ చెప్పారు. భారత జట్టు ప్రపంచకప్‌ను తీసుకువ‌స్తుందని ధీమా వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ట్విట్టర్ వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ మ్యాచ్ టీంఇండియా గెలవాలని ప్రతి ఒక్క భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియానే హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

హైదరాబాద్ నగరంలో మ్యాచ్ వీక్షించేందుకు క్రికెట్‌ అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు అభిమానుల క్రికెట్‌ క్రేజ్‌కు మరింత జోష్‌నిస్తూ నగరంలోని బడా రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్బులు, క్లబ్బులు, కాఫీ షాపులు ప్రత్యేక ఆఫర్‌లతో క్రికెట్‌ వినోదాన్ని పంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశాయి. 'జయహో భారత్‌' అనే ప్రత్యేక స్క్రీన్‌లతో మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారాలను అభిమానులు చూసేలా చర్యలు తీసుకుంటున్నారు.

Story first published: Tuesday, July 9, 2019, 14:27 [IST]
Other articles published on Jul 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+