వన్డే కెరీర్‌లో ఐదు వికెట్లు.. రికార్డుల్లోకెక్కిన మహ్మద్ షమీ

బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి తన వన్డే కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసాడు. షమీ వన్డే కెరీర్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. తన కోటా 10 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చి బెయిర్‌స్టో, రూట్, మోర్గాన్, బట్లర్, క్రిస్ వోక్స్‌లను ఔట్ చేసాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఆరో బౌలర్‌గా:
ఇక ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఐదు వికెట్ల తీసిన ఆరో బౌలర్‌గా షమీ రికార్డులో నిలిచాడు. కపిల్ దేవ్ (1983), రాబిన్ సింగ్ (1999), వెంకటేష్ ప్రసాద్ (1999), ఆశిష్ నెహ్రా (2003), యువరాజ్ సింగ్ (2011), మహ్మద్ షమీ (2019)లు ప్రపంచకప్‌లో ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్లుగా నిలిచారు.

అఫ్రిదీ సరసన:
మరోవైపు ప్రపంచకప్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో నాలుగు వికెట్లను పడగొట్టి పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ సరసన నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్ షమీ. అయితే వన్డేల్లో మాత్రం నరేంద్ర హిర్వానీ భారత్ తరఫున వరుసగా మాడు మ్యాచుల్లో నాలుగు వికెట్లు తీసాడు. హిర్వానీ తర్వాత షమీ ఈ రికార్డు అందుకున్నాడు.

తొలి షాక్:
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఓపెనర్, 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' జానీ బెయిర్‌స్టో (109 బంతుల్లో 111; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ చేసాడు. మరో ఓపెనర్ జేసన్ రాయ్ (57 బంతుల్లో 66; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (54 బంతుల్లో 79; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసాడు. లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ (109 బంతుల్లో 102; 15 ఫోర్లు) సెంచరీ.. కెప్టెన్ విరాట్ కోహ్లి (76 బంతుల్లో 66; 7 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 45; 4 ఫోర్లు) మెరిసినా.. టీమిండియా భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 31 పరుగుల తేడాతో ఓడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications