
ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్లు జాన్ని బెయిర్‌స్టో, జేసన్ రాయ్ బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. భారత్ బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొంటూ వేగంగా పరుగుల వరద పారిస్తున్నారు. ఇద్దరూ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
జేసన్ రాయ్ మీడియం పేసర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔట్ అయినా.. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో రాయ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. చాహల్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో రాయ్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ఐతే బుమ్రా వేసిన 9వ ఓవర్లో ఆరు బంతులు ఎదుర్కొన్న బెయిర్‌స్టో ఒక్క పరుగు కూడా సాధించలేకపోయాడు.
హార్దిక్ పాండ్య వేసిన 11వ ఓవర్లో రాయ్ వరుసగా సిక్స్, ఫోర్ బాది 13 రన్స్ సాధించడంతో ఇంగ్లాండ్ 11 ఓవర్లలో 60 మార్క్ చేరింది. ఇక బెయిర్‌స్టో స్పిన్నర్ చాహల్ వేసిన 16వ ఓవర్ మూడో బంతిని సిక్సర్‌గా మలిచి హాఫ్ సెంచరీ చేరుకున్నాడు. 17ఓవర్లో మరో ఓపెనర్ రాయ్ కూడా హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఇద్దరూ ధాటిగా ఆడుతుండడంతో ఇంగ్లండ్ స్కోర్ పరుగెడుతోంది.
భారత కెప్టెన్ కోహ్లీ ఎందరి బౌలర్లను మార్చినా.. ఉపయోగం లేదు. బౌలర్లు వీరిని కట్టడి చేయడానికి కష్టపడుతున్నారు. ప్రస్తుతం 19 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 141 పరుగులు చేసింది. బెయిర్‌స్టో 77, యార్ 59 పరుగులతో క్రీజులో ఉన్నారు.
{headtohead_cricket_3_2}