Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

90 బంతుల్లో బెయిర్‌స్టో సెంచరీ

ICC Cricket World Cup 2019: India vs England: India bowlers fight back after Jonny Bairstow ton

బర్మింగ్‌హామ్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో దుమ్మురేపాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బౌలింగ్‌ను ఓ ఆటాడుకుంటూ పరుగుల వరద పారించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగుతూ బెయిర్‌స్టో (100: 90 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు శతకం చేసాడు. వన్డే కెరీర్‌లో అతనికిది 8వ సెంచరీ కాగా.. ప్రపంచకప్ టోర్నీలో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.

అయితే సెంచరీ అనంతరం ధాటిగా ఆడే క్రమంలో షమీ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి పంత్‌కు చిక్కాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రాయ్, బెయిర్‌స్టోలు 160 పరుగుల పటిష్ట భాగస్వామ్యాన్ని అందించారు. ఇద్దరూ పోటీపడి బౌండరీలు, సిక్సులు బాదడంలో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే హాఫ్ సెంచరీ అనంతరం జేసన్ రాయ్‌ (66; 57బంతుల్లో 7×4, 2×6) ఔట్‌ అయ్యాడు. కుల్దీప్ వేసిన 23వ ఓవర్ తొలి బంతిని భారీ షాట్ ఆడగా.. సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్ రవీంద్ర జడేజా అద్భుత క్యాచ్ పట్టుకోవడంతో పెవిలియన్ చేరాడు.

అనంతరం రూట్‌ అండతో బెయిర్‌స్టో స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. రూట్‌ ఆచితూచి ఆడగా.. బెయిర్‌స్టో బ్యాట్ జులిపించి 90బంతుల్లోనే సెంచరీ చేసాడు. ధాటిగా ఆడే క్రమంలో బెయిర్‌స్టో పెవిలియన్ చేరాడు. ఇక షమీ వేసిన 34వ ఓవర్ నాలుగో బంతికి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (1) క్యాచ్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రూట్‌ (23), బెన్ స్టోక్స్ (0)లు ఉన్నారు. 34 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.

1
43681

{headtohead_cricket_3_2}

Story first published: Sunday, June 30, 2019, 17:49 [IST]
Other articles published on Jun 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+