న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టోక్స్‌ హాఫ్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లండ్

ICC Cricket World Cup 2019: India vs England: England turn to Buttler, Stokes for big finish

ప్రపంచ‌కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్‌ హాఫ్ సెంచరీ చేసాడు. షమీ వేసిన 45 వ ఓవర్ ఆఖరి బంతికి రెండు పరుగులు రాబట్టి స్టోక్స్‌ (51) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బౌండరీలు, సిక్సులతో చెలరేగుతూ 38 బంతుల్లోనే స్టోక్స్‌ హాఫ్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో స్టోక్స్‌కి 19వ హాఫ్ సెంచరీ.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

హాఫ్ సెంచరీ అనంతరం స్టోక్స్‌ నెమ్మదించగా.. బట్లర్‌ విరుచుకుపడడంతో ఇంగ్లండ్ స్కోర్ 300 దాటింది. షమీ వేసిన 47వ ఓవర్ నాలుగో బంతిని ఫోర్, ఇదో బంతిని సిక్స్ కొట్టిన బట్లర్‌ (20; 8బంతుల్లో 1×4, 2×6).. చివరి బంతిని కూడా భారీ ఆడి షమీకే చిక్కాడు. ఈ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. స్టోక్స్‌కు వోక్స్ కూడా జాతవడంతో స్కోర్ పరుగులు పెడుతోంది.

అయితే షమీ వేసిన 49వ ఓవర్ తొలి బంతికి వోక్స్ క్యాచ్ ఔట్ అయ్యాడు. మ్యాచ్‌లో షమీకి ఐదు వికెట్లు దక్కాయి. ప్రస్తుతం క్రీజులో స్టోక్స్‌ (77), ప్లంకెట్ (0)లు ఉన్నారు. 49.4 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. స్టోక్స్‌ ముందుండి ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. స్టోక్స్‌ దెబ్బకు ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళుతోంది.

1
43681

{headtohead_cricket_3_2}

Story first published: Sunday, June 30, 2019, 19:00 [IST]
Other articles published on Jun 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X