Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్ ఆట ఆశ్చర్యానికి గురిచేస్తుంది: కోహ్లీ

ICC Cricket World Cup 2019: India vs England: Englands struggle leaves Virat Kohli surprised

ఇంగ్లాండ్‌ టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి అనూహ్య పరాజయాలతో సెమీస్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లపై 232, 286 పరుగులను ఛేదించలేక ఓడిపోయింది. ఇక సెమీస్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ఒక్క మ్యాచ్‌ ఓడినా ఇంగ్లాండ్‌ సెమీస్‌ అవకాశాలు మరింత తగ్గుతాయి. మరోవైపు ఇప్పటికే దాదాపుగా సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకున్న భారత్‌.. ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే అధికారికంగా సెమీస్‌కు చేరుకుంటుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రస్తుతం ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా టీమిండియాతో ఇంగ్లాండ్‌ తలపడుతుంది. మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'గత ఫామ్, స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ చెలరేగిపోతుందని అందరం అనుకున్నాం. అయితే ప్రస్తుత పరిస్థితి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది' అని కోహ్లీ అన్నారు.

'మెగా టోర్నీలో ఒత్తిడి కీలక పాత్ర పోషిస్తుంది. ఒక్కోసారి తక్కువ పరుగులను కాపాడుకునే పరిస్థితి కూడా ఎదురౌతుంది. ఇదే విషయాన్ని ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందే చెప్పా. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో మాకు అదే పరిస్థితి ఎదురైంది. కాబట్టి ఏ విషయాన్ని తేలికగా తీసుకోకూడదు' అని కోహ్లీ పేర్కొన్నాడు.

Story first published: Sunday, June 30, 2019, 16:17 [IST]
Other articles published on Jun 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+