
ప్రపంచకప్‌లో భాగంగా రెండో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా మరికొద్ది సేపట్లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రాఫే మోర్తాజ బౌలింగ్ ఎంచుకున్నాడు. గత వార్మప్ మ్యాచ్‌లో ఆడని విజయ్ శంకర్ ఈ మ్యాచ్ ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్ కూడా ఆడుతున్నాడు. కేదార్ జాధవ్‌లు మాత్రం ఆడడం లేదు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీంఇండియా ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అందరూ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో మిగిలిన ఈ ఒకే ఒక మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాలని భారత్ చూస్తోంది. మరోవైపు బంగ్లా పరిస్థితి భిన్నంగా ఉంది. పాక్‌తో జరగాల్సిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే వర్షార్పణమైంది. ఇక ఈ మ్యాచ్ ద్వారానైనా ప్రాక్టీస్ చేయాలని భావిస్తోంది.
టీమిండియా జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్, మహ్మద్ షమీ, కుల్‌దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా.
బంగ్లాదేశ్ జట్టు:
మష్రాఫే మోర్తాజ (కెప్టెన్), తమిమ్ ఇక్బాల్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, ముష్‌ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, షకీబ్ అల్ హసన్, మోహ్మద్ మిథున్, సబ్బీర్ రామన్, మొసాద్దెక్ హుసెన్, మొహమ్మద్ సైఫుద్దీన్, మెహిదీ హసన్, రుబెన్ హుసెన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, అబు జైద్.