Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌.. కోహ్లీ సేనకు భారతీయ వంటకాలు

ICC Cricket World Cup 2019, India vs Australia: Virat Kohlis Team eat indian food in England

ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా కోహ్లీ సేన ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉంది. విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు భారత ఆటగాళ్లకు మన వంటకాలు దొరకడం కొంచెం కష్టమే. అయితే ఆటగాళ్లకు తిండి పరంగా ఎలాంటి లోటు లేకుండా బీసీసీఐ దృష్టి సారించింది. బీసీసీఐ ప్రత్యేక శ్రద్ద తీసుకుని కోహ్లీ సేనకు కావాల్సిన భారతీయ వంటకాలను అందిస్తోందట.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

భారతీయ వంటకాల కోసం ఇంగ్లాండ్‌లోని స్థానిక భారత హోటళ్లతో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం స్థానిక హోటళ్లు ఆటగాళ్లు ఎక్కడున్నా అన్ని రకాల భారతీయ వంటకాలను అందిస్తున్నాయి. ఇంగ్లాండ్‌లోని అన్ని స్టేడియాలకు దగ్గరలో భారతీయ హోటళ్లు ఉండడంతో.. ఆటగాళ్లు వేడి వేడి వంటలను ఆరగిస్తున్నారట.

దక్షిణాఫ్రికాను ఓడించి ప్రపంచకప్‌లో శుభారంభం చేసిన భారత్‌.. ఆదివారం తన రెండో మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను ఢీకొంటోంది. లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా నేడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. బలాబలాల్లో సమానంగా కనిపిస్తున్న ఈ రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగనుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. ఇక అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 136 వన్డేలు జరగ్గా.. భారత్‌ 49, ఆస్ట్రేలియా 77 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పదింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్‌లో పదకొండు మ్యాచ్‌లకు గాను భారత్‌ మూడింట్లో, ఆసీస్‌ ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలుపుపొందింది. చివరగా ఇరుజట్లు 2015 ప్రపంచకప్‌ సెమిస్లో తలపడగా.. ఆసిస్ గెలిచింది. చివరి ఐదు వన్డేల్లోనూ ఆస్ట్రేలియా విజయం సాధించగా.. భారత్‌ తన చివరి 5 వన్డేల్లో రెండే గెలిచింది.

ఓవల్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటిదాకా ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో స్కోర్లు 300 దాటాయి. ఈ రోజటి మ్యాచ్‌కు ఫ్లాట్‌ పిచ్‌ ఎదురుకానుంది. గాలులు వీస్తున్నప్పటికీ వాతావరణం పొడిగా ఉండనుంది. వర్షానికి అవకాశం లేదు. టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగే ఎంచుకునే అవకాశముంది. మధ్యాహ్నం గం.3 నుంచి మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవనుంది.

Story first published: Sunday, June 9, 2019, 11:23 [IST]
Other articles published on Jun 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+