Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో 'సూపర్ స్టార్' మహేశ్‌బాబు

ICC Cricket World Cup 2019, India vs Australia: Tollywood Hero Mahesh Babu’s Selfie With Son Goutham From The Oval

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. రెండు ఫేవరేట్ జట్ల మధ్య మ్యాచ్ కావడంతో.. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత్ నుంచి చాలా మంది క్రికెట్ అభిమానులు వెళ్లారు. అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా లండన్‌కు వెళ్లారు.

1
43657

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టాలీవుడ్ 'సూపర్ స్టార్' మహేశ్‌బాబు కూడా భారత్, ఆస్ట్రేలియాల మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఓవల్ మైదానంలోకు వెళ్లారు. మహేశ్‌బాబు తన కుటుంబ‌ స‌భ్యుల‌తో క‌లిసి మ్యాచ్ వీక్షిస్తున్నారు. మ్యాచ్ వీక్షిస్తూ సెల్ఫీ దిగిన ఫొటోలను మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'నా కొడుకు గౌతమ్ కోసం మ్యాచ్ చూడడానికి వచ్చాం' అని మహేష్ పేర్కొన్నారు. మహేశ్‌బాబు తన కుటుంబంతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా ఉన్నాడు.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. మహేష్ అభిమానులు ఈ పోటోలను షేర్ చేస్తున్నారు. మహేశ్‌బాబు నటించిన 'మ‌హ‌ర్షి' సినిమా ఇటీవ‌ల విడుద‌లై బంపర్ హిట్ అయింది. దీంతో చిత్రబృందం సినిమా సక్సెస్‌ను లండన్‌లో ఎంజాయ్ చేస్తోంది. హీరో మహేశ్ బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కుటుంబ‌ స‌భ్యులు లండన్‌లో విహరిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు మ్యాచ్ చూడడానికి మైదానానికి వెళ్లారు.

Story first published: Sunday, June 9, 2019, 17:24 [IST]
Other articles published on Jun 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+