Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్.. సచిన్‌ రికార్డును అధిగమించిన రోహిత్‌ శర్మ

ICC Cricket World Cup 2019, India vs Australia: Shikhar Dhawan, Rohit Sharma set flurry of records vs Australia

ప్రపంచకప్‌లో భాగంగా లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాపై వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో రెండు వేల పరుగులను సాధించిన ఆటగాడిగా రోహిత్ రికార్డు నెలకొల్పాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై 37 ఇన్నింగ్స్‌ల్లోనే రెండు వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆసీస్‌పై అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఆ మార్కును అందుకున్న ఆటగాడిగా గుర్తింపు పొందాడు. టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఆసీస్‌పై రెండు వేల పరుగులు చేయడానికి 40 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఆసీస్‌పై తక్కువ ఇన్నింగ్స్‌ల్లో రెండు వేల పరుగుల పూర్తి చేసుకున్న ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ, సచిన్‌ల తర్వాతి స్థానంలో వెస్టిండీస్‌ మాజీ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ ఉన్నాడు.

1
43657

అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ అర్ధ శతకం చేసి పెవిలియన్ చేరాడు. ధావన్‌తో కలిసి తొలి వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. మరోవైపు శిఖర్‌ ధావన్‌-రోహిత్‌ శర్మలు అరుదైన ఘనత సాధించారు. ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అత్యధికంగా 100, అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన రెండో జోడిగా నిలిచారు. ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో రోహిత్‌, ధావన్‌ల జోడికి ఇది ఆరో సెంచరీ భాగస్వామ్యం. దీంతో ఆసీస్ మాజీ జంట ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌-మ్యాథ్యూ హేడెన్‌ల సరసన నిలిచారు. ఇక వన్డేల్లో భారత్‌ తరఫున అత్యధిక సార్లు వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన జోడిల్లో మూడో స్థానంలో నిలిచారు.

Story first published: Sunday, June 9, 2019, 19:39 [IST]
Other articles published on Jun 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+