ఓపెనర్ల అర్ధ శతకాలు.. రోహిత్ శర్మ అరుదైన రికార్డు
ICC Cricket World Cup 2019: Rohit Sharma's Fastest, 2000 ODI Runs Against Australia & Breaks Record

ప్రపంచకప్‌లో భాగంగా లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు అర్ధ శతకాలు చేశారు. ఆరంభం నుంచి ఆచితూచి ఆడిన ఇద్దరు బౌండరీలతో విరుచుక పడడంతో భారత స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో టీమిండియా స్కోర్ 100కి చేరుకుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మొదటగా స్టోయినిస్ వేసిన 18వ ఓవర్ నాలుగో బంతికి ధావన్ సింగిల్ తీసి.. 52 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అనంతరం స్టోయినిస్ వేసిన 20వ ఓవర్‌లో రెండు వరుస ఫోర్లు బాది ఇన్నింగ్స్ కు ఊపుతెచ్చాడు. మరోవైపు 21 ఓవర్ మొదటి బంతికి ఫోర్ కొట్టి రోహిత్ అర్ధ శతకం చేసాడు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో ఆసీస్‌తో మ్యాచ్‌లో 2వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
ఈ ఇద్దరు ఆసీస్ బౌలర్లు స్టార్క్, కమిన్స్, కౌల్టర్ నైల్, స్టాయినీస్, జంపాల బౌలింగ్‌లో స్వేచ్చగా రన్స్ సాధిస్తున్నారు. ఈ క్రమంలో 127 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 22 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 127 పరుగులు చేసింది. ధావన్ (67), రోహిత్ (57) క్రీజులో ఉన్నారు.
Story first published: Sunday, June 9, 2019, 16:57 [IST]
Other articles published on Jun 9, 2019
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications