Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియాపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌

ICC Cricket World Cup 2019, India vs Australia: India have won the toss and have opted to bat

లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాయి. తొలి మ్యాచ్‌తోనే బోణీ కొట్టిన భారత జట్టు కంగారూలను కట్టడి చేయాలని చూస్తోంది. మరోవైపు వరుస విజయాలతో జోరుమీదున్నఆసీస్.. హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య ఇప్పటి వరకు 136 వన్డేలు జరగ్గా.. భారత్‌ 49, ఆస్ట్రేలియా 77 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పదింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్‌లో పదకొండు మ్యాచ్‌లకు గాను భారత్‌ మూడింట్లో, ఆసీస్‌ ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలుపుపొందింది. చివరగా ఇరుజట్లు 2015 ప్రపంచకప్‌ సెమిస్ లో తలపడగా.. ఆసిస్ గెలిచింది. చివరి ఐదు వన్డేల్లోనూ ఆస్ట్రేలియా విజయం సాధించగా.. భారత్‌ తన చివరి 5 వన్డేల్లో రెండే గెలిచింది.

ఓవల్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటిదాకా ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో స్కోర్లు 300 దాటాయి. ఈ రోజటి మ్యాచ్‌కు ఫ్లాట్‌ పిచ్‌ ఎదురుకానుంది. పిచ్‌ ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలిస్తుంది కాబట్టి బుమ్రా, భువీ, స్టార్క్‌, కమిన్స్‌లు చెలరేగే అవకాశం ఉంది. గాలులు వీస్తున్నప్పటికీ వాతావరణం పొడిగా ఉండనుంది. వర్షానికి అవకాశం లేదు.

జట్లు:
భారత్‌: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్‌ జాదవ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, జఫ్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్‌ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, ఉస్మాన్‌ ఖాజా, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), నాథన్ కూల్టర్‌ నైల్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్‌ జంపా.

Story first published: Sunday, June 9, 2019, 14:51 [IST]
Other articles published on Jun 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+