శిఖర్ ధావన్ సెంచరీ.. ఆసీస్ లక్ష్యం 353

ప్రపంచకప్‌లో భాగంగా లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (117; 109బంతుల్లో 16×4) సెంచరీ చేసి భారీ స్కోరులో కీలక పాత్ర పోషించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

శుభారంభం:
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు నెమ్మదిగా ఆరంభించారు. మిచెల్ స్టార్క్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి క్యాచ్ అవుట్ ప్రమాదం నుండి రోహిత్ బయటపడ్డాడు. కమిన్స్, స్టార్క్ కళ్లు చెదిరే బంతులతో ఓపెనర్లను స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయకుండా కట్టడి చేశారు. అనంతరం పుంజుకున్న ధావన్.. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ధావన్ 52 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

ధావన్ శతకం:
మరోవైపు రోహిత్ కూడా వేగం పెంచి 21 ఓవర్ మొదటి బంతికి ఫోర్ కొట్టి అర్ధ శతకం చేసాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న రోహిత్ (57; 70బంతుల్లో 3×4, 1×6) జట్టు స్కోర్ 127 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. కౌల్టర్ నైల్ వేసిన 23వ ఓవర్ మూడో బంతిని కీపర్ కేరీకి సునాయాస క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే కెప్టెన్ కోహ్లీతో కలిసి ధావన్ ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించి.. 95 బంతుల్లో శతకం అందుకున్నాడు.

పాండ్య దూకుడు:
శతకం అనంతరం దూకుడు పెంచిన గబ్బర్ భారీ షాట్ ఆడి ఔట్ అయ్యాడు. ఈ దశలో కెప్టెన్ కోహ్లీ (82: 77 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు), హార్డ్‌హిట్టర్ హార్దిక్ పాండ్య (48: 27 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు)లు వేగం పెంచడంతో స్కోర్ 300 చేరువలో వచ్చింది. అయితే పాండ్య ఔట్ అయినా.. చివరలో ధోనీ (27: 14 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్), కోహ్లీ బౌండరీల వర్షం కురిపించడంతో స్కోర్ బోర్డును 300 దాటించారు. చివరి ఓవర్లో రాహుల్ 14 పరుగులు చేయడంతో భారత్ 352 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో స్టోయినిస్ రెండు వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications