'కోహ్లీ కెప్టెన్సీ సూపర్.. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఎక్కడా ఆందోళన చెందలేదు'

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందనలతో ముంచెత్తారు. ప్రపంచకప్‌లో భాగంగా శనివారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా అతడిలో ఏమాత్రం ఆందోళన కనిపించలేదు. కోహ్లీ కెప్టెన్సీ సూపర్ అని సచిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సౌతాంప్టన్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. పేస్ బౌలర్ మహ్మద్ షమీ చివరి ఓవర్‌లో హ్యాట్రిక్ తీసి టీమిండియాకు చిరస్మరనీయ విజయాన్ని అందించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

కోహ్లీ కెప్టెన్సీ సూపర్:
సచిన్ మాట్లాడుతూ... 'ఈ మ్యాచ్‌లో కోహ్లీ కెప్టెన్సీ సూపర్. మ్యాచ్ మొత్తం అతడిలో ఏమాత్రం ఆందోళన కనపడలేదు. కోహ్లీ బాడీ లాంగ్వేజ్, ఫుట్‌వర్క్ ఆకట్టుకుంది. కీలక సమయంలో బుమ్రా, హార్దిక్ పాండ్యాలతో డాట్‌బాల్స్ వేయించాడు. డాట్ బాల్స్ పడే కొద్ది అఫ్గాన్ ఓటమివైపు పయనించింది. ఫీల్డింగ్ కూడా బాగా పెట్టాడు. కీలక పరుగులు కూడా చేసాడు' అని సచిన్ అన్నారు. మధ్య ఓవర్లలో ధోనీ, జాదవ్‌లు నెమ్మదైన భాగస్వామ్యంతో విసుగెత్తించారని విమర్శించారు.

హాలెండ్‌తో మ్యాచ్ గుర్తుకువచ్చింది:
'ఈ మ్యాచ్‌తో 2003 ప్రపంచకప్‌లో హాలెండ్‌తో జరిగిన మ్యాచ్ గుర్తుకువచ్చింది. అప్పుడు తక్కువ పరుగులే చేశాం. బౌలర్లు రాణించడంతో విజయం సాధించాం. నెమ్మదైన పిచ్‌పై అఫ్గాన్ క్రికెటర్లు రాణించారు. మొదట బౌలింగ్‌లో, తర్వాత బ్యాట్‌తోనూ అదరగొట్టి భారత్‌ను హడలెత్తించారు. మ్యాచ్ మొత్తం అఫ్గాన్ బాగా పోరాడింది' అని సచిన్ పేర్కొన్నారు.

షమీకి ముందే చెప్పా:
షమీ హ్యాట్రిక్‌పై సచిన్ మాట్లాడుతూ... 'త్వరలోనే నీకు టైం వస్తుంది. తుది జట్టులో అవకాశం లభిస్తుంది అని షమీకి ముందే చెప్పాను. భువనేశ్వర్‌కు గాయం కావాలనేది నా ఉద్దేశం కాదు. ఎప్పుడైనా అవకాశం రావొచ్చు, సంసిద్ధంగా ఉండాలని షమీకి చెప్పాను. అయితే దురదృష్టవశాత్తు భువీ గాయంతో వైదొలగడం.. షమీకి అవకాశం వచ్చింది. షమీ అద్భుత ప్రదర్శన చేసాడు. ప్రతీ బంతిని 140 కిలోమీటర్ల వేగం తగ్గకుండా వేసాడు' అని సచిన్ ప్రశంసించారు.

ఉత్కంఠ విజయం:
ఈ మ్యాచ్‌లో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (67), కేదార్ జాదవ్ (52)లు హాఫ్ సెంచరీలు చేశారు. కేఎల్ రాహుల్ (30), విజయ్ శంకర్ (29), ధోనీ (28)లు ఫర్వాలేదనిపించారు. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గాన్ 213 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ (52) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. షమీ హ్యాట్రిక్ తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications