
ప్రపంచకప్‌లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా శనివారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్టంపౌట్ అయ్యాడు. టీంఇండియా ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వేసిన 45 ఓవర్ మూడో బంతిని క్రీజు వదిలి ముందుకొచ్చి ఆడబోయిన ధోనీ.. స్టంప్ ఔట్ అయ్యాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
వన్డే ఫార్మాట్‌లో ధోనీ స్టంప్ ఔట్ కావడం ఇది రెండోసారి మాత్రమే. అంతకుముందు 2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ స్టంప్ ఔట్ అయ్యాడు. ధోనీ ఇన్నేళ్ల కెరీర్ (345 వన్డేలలో)లో స్టంప్ ఔట్ కావడం ఇది రెండోసారి మాత్రమే కావడం విశేషం. ఎంతోమంది బ్యాట్స్‌మెన్‌లను రెప్పపాటులో స్టంపౌట్ చేసిన ధోనీ ఇలా ఔట్ అవ్వడం కొత్తగా ఉంది. ఈ మ్యాచ్‌లో ధోనీ 28 (52బంతుల్లో 3x4)నెమ్మదిగా ఆడి పెవిలియన్ చేరాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (67), కేదార్ జాదవ్ (52)లు హాఫ్ సెంచరీలు చేశారు. కేఎల్ రాహుల్ (30), విజయ్ శంకర్ (29), ధోనీ (28)లు ఫర్వాలేదనిపించారు. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గాన్ 213 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ (52) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.