For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ట్రాఫిక్‌ పోలీసులకు దొరికినప్పుడు.. కోహ్లీ ఫోటో వైరల్

ICC Cricket World Cup 2019 : Kohli Pleads With Folded Hands To Umpire Over DRS Call || Oneindia
ICC Cricket World Cup 2019, India vs Afghanistan: Memes galore as Virat Kohli pleads with folded hands to umpire over DRS call

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. భారత్‌, అఫ్గాన్‌ మ్యాచ్‌లో కోహ్లీ అంపైర్‌తో వాదించిన ఘటనే ఈ వైరల్‌కు కారణం. శనివారం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో పేసర్ మహ్మద్‌ షమీ వేసిన బంతి అఫ్గాన్‌ ఓపెనర్‌ హజ్రతుల్లా ప్యాడ్స్‌కు తగిలింది. భారత ఆటగాళ్లంతా అప్పీల్‌ చేయగా.. అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ, బౌలర్‌ షమీతో చర్చించిన కెప్టెన్ కోహ్లీ రివ్యూ కోరాడు. అయితే బంతి ఔట్‌ సైడ్‌ పిచ్‌ అవ్వడంతో థర్డ్‌ అంపైర్‌.. ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయానికే వదిలేసాడు. ఈ సందర్భంగా కోహ్లీ అంపైర్‌తో వాదిస్తూ రెండు చేతులు జోడించి ఏదో అన్నాడు. ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఫొటోపై సరదా మీమ్స్‌ పెట్టి అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు. ఫన్నీ కామెంట్స్‌తో నెటిజన్లు పోటీపడుతున్నారు.

ఆస్ట్రేలియా టెస్ట్‌ సిరీస్‌ సందర్భంగా అభిమానులకు వేలు చూపించిన కోహ్లీ ఫొటోను జత చేసి మీమ్స్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. క్లాస్‌లో అటెండెన్స్‌ కోసం ప్రాధేయపడే స్టూడెంటని ట్రోల్‌ చేస్తున్నారు. లోన్‌ కోసం, ట్రాఫిక్‌ పోలీసులకు దొరికినప్పుటి పరిస్థితి, లీవ్‌ కోసం బాస్‌ ముందుకు వెళ్లినప్పుడు ఇలానే ఉండాలని ట్రోల్‌ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా ముందుగా బ్యాటింగ్‌ చేసి 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (67), కేదార్‌ జాదవ్‌ (52)లు హాఫ్‌ సెంచరీలు చేశారు. కేఎల్‌ రాహుల్‌ (30), విజయ్‌ శంకర్‌ (29), ధోనీ (28)లు ఫర్వాలేదనిపించారు. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గాన్‌ 213 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ (52) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. షమీ హ్యాట్రిక్‌ తీసాడు.

Story first published: Sunday, June 23, 2019, 17:51 [IST]
Other articles published on Jun 23, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+