న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌.. అఫ్గాన్‌ మ్యాచ్ టీమిండియాకు గట్టి హెచ్చరిక

ICC Cricket World Cup 2019 : India Showed Too Much Respect To Afghan Spinners,Says Kris Srikkanth
ICC Cricket World Cup 2019, India vs Afghanistan: India showed too much respect to Afghan spinners: Kris Srikkanth

ప్రపంచకప్‌లో భాగంగా శనివారం ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ టీమిండియాకు గట్టి హెచ్చరిక. ఏ జట్టునైనా తేలికగా తీసుకోవద్దని ఈ మ్యాచ్ ద్వారా తెలిసింది అని టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నారు. సౌతాంప్టన్‌ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. పేస్ బౌలర్ మహ్మద్‌ షమీ హ్యాట్రిక్‌ తీసి టీమిండియాకు చిరస్మరనీయ విజయాన్ని అందించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అతి మర్యాద ఇచ్చారు:

అతి మర్యాద ఇచ్చారు:

తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ... 'వికెట్ చాలా నెమ్మదిగా ఉంది. అయినా మధ్య ఓవర్లలో భారత బ్యాటింగ్ ప్రదర్శన బాగాలేదు. అఫ్గాన్‌ బౌలర్లు మహ్మద్‌ నబీ, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, రషీద్‌ ఖాన్‌ బాగా బౌలింగ్ చేశారు. అయినా భారత్‌ను 225 పరుగులలోపే కట్టడి చేసేంత ప్రదర్శన కాదు. అఫ్గాన్‌ బౌలర్లకు టీమిండియా బ్యాట్స్‌మెన్‌ అతి మర్యాద ఇచ్చారు' అని శ్రీకాంత్ పేర్కొన్నారు.

గట్టి హెచ్చరిక:

గట్టి హెచ్చరిక:

ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అద్భుతమైన కెప్టెన్సీ చేసాడు. కీలక సమయాల్లో నిర్ణయాలు ఫలితాన్ని ఇచ్చాయి. అఫ్గాన్‌ ఆఖరి వరకూ పోరాడినా టీమిండియా గెలవడం ముఖ్యం. ఇలాంటి ఉత్కంఠ మ్యాచ్ నేను ఊహించలేదు. ప్రపంచకప్‌లో ఇలాంటి మ్యాచ్‌లు అవసరం. టీమిండియాకు కూడా. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ ద్వారా ఏ జట్టును తేలికగా తీసుకోవద్దని ఇంగ్లాండ్‌కు తెలిసే ఉంటుంది. టీమిండియా, ఇంగ్లాండ్ జట్లకు ఇవి గట్టి హెచ్చరిక' అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

సెమీస్ చేరడం లాంఛనమే:

సెమీస్ చేరడం లాంఛనమే:

టీమిండియా తన తదుపరి మ్యాచ్‌లను విండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో ఆడనుంది. ఇంగ్లండ్ మినహా అన్ని జట్లు ఫామ్ లో లేవు. టీమిండియా సెమీస్ చేరడం లాంఛనమే. మరోవైపు దక్షిణాఫ్రికాపై విజయంతో ఇంగ్లండ్ శుభారంభం చేసినా.. తమకంటే ఎంతో బలహీనమైన జట్లయిన పాక్‌, లంక చేతుల్లో ఓడిపోయింది. దీంతో ఇంగ్లండ్‌కు మిగిలిన మ్యాచ్‌లన్నీ కఠినమైన ప్రత్యర్థులతోనే. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓడితే ఆ జట్టు నాకౌట్‌ దశ అవకాశాలకు దెబ్బపడినా ఆశ్చర్యం లేదు.

Story first published: Monday, June 24, 2019, 11:43 [IST]
Other articles published on Jun 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X