క్లైవ్ లాయిడ్ హెచ్చరిక.. టీమిండియా లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌ను పటిష్ఠం చేసుకోవాలి

టీమిండియా లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌ను పటిష్ఠం చేసుకోవాలని వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ పరోక్షంగా హెచ్చరించారు. టాప్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీలు పరుగులు చేస్తుండడంతో టీమిండియా నెట్టుకువస్తోంది. ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌లపై మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్‌లు మరీ నెమ్మదిగా ఆడారు. ఇంగ్లండ్‌పై అయితే ఈ జోడి పరుగులు చేయడంలో విఫలమయింది. దీంతో గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. లోయర్ ఆర్డర్ కూడా ఎప్పుడూ ఆదుకోలేదు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

లోయర్ ఆర్డర్‌ను బలోపేతం చేసుకోవాలి:
ఈ నేపథ్యంలో క్లైవ్ లాయిడ్ టీమిండియాకు సూచన చేసాడు. 'టీమిండియాలో సెలక్షన్ గందరగోళంగా ఉంది. వారిపై ఇంగ్లాండ్ అద్భుత విజయం సాధించింది. ముఖ్యంగా స్పిన్నర్లపై ఎదురు దాడికి దిగి పరుగులు చేశారు. లోయర్ ఆర్డర్ వరకు బ్యాటింగ్ చేయగల వారు ఉండడం కలిసొచ్చింది. టీమిండియా కూడా లోయర్ ఆర్డర్‌ను బలోపేతం చేసుకోవాలి' అని క్లైవ్ లాయిడ్ సూచించారు.

పిచ్‌లు అత్యంత కీలకం:
'ఇప్పటికే ఆస్ట్రేలియా, టీమిండియా సెమీస్ చేరాయి. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లే అద్భుతంగా ఆడుతున్నాయి. ఇతర జట్ల కన్నా.. ఈ జట్లే ఇంగ్లాండ్ పరిస్థితులను బాగా అర్థం చేసుకున్నాయి. అదే ఇక్కడ ముఖ్యం. పిచ్‌లు అద్భుతంగా ఉన్నాయి. నాకౌట్ మ్యాచుల్లో పిచ్‌లు అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయి' అని లాయిడ్ పేర్కొన్నారు.

బాధ కలిగిస్తోంది:
విండీస్ టోర్నీ నుండి నిష్క్రమించడం బాధ కలిగిస్తోంది. విండీస్ ప్రదర్శన ఏ మాత్రం బాగాలేదు. శ్రీలంకపై లక్ష్య ఛేదనలో పూరన్ అద్భుతంగా ఆడాడు. అయితే కీలక సమయంలో వికెట్ చేజార్చుకోవడం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. విండీస్ క్రికెట్, ప్రతిభపై నేను ఆశావహ దృక్పథంతో ఉన్నా' అని క్లైవ్ లాయిడ్ చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications