Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌.. బంగ్లాదేశ్‌తో భారత్‌ ఢీ

ICC Cricket World Cup 2019 : India Look To Solve Batting Against Bangladesh In Last Warm-Up Match
ICC Cricket World Cup 2019: India Look to Solve Batting Woes Against Bangladesh in 2nd Warm-up

మెగా టోర్నీ ప్రపంచకప్‌నకు ముందు తన చివరి ప్రాక్టీస్‌ పోరుకు భారత్‌ సిద్ధమైంది. మంగళవారం జరిగే వార్మప్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత టాపార్డర్‌ పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. దీంతో అసలు సమరానికి ముందు మిగిలిన ఈ ఒకే ఒక మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాలని భారత్ చూస్తోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు కేదార్ జాదవ్‌, విజయ్‌ శంకర్‌లు తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడలేదు. ఇప్పటికీ ఈ ఇద్దరు పూర్తిగా కోలుకున్నారో లేదో కూడా సరైన సమాచారం లేదు. ఇది టీమిండియాను ఆందోళన కలిగించే విషయం. అయితే వీరి స్థానాల్లో ఆడిన కార్తీక్, రాహుల్ లు పరుగులు చేయలేదు. వీరితో పాటు అందరూ గాడిలో పడాల్సిన అవసరం ఉంది.

గత మ్యాచ్‌లో ఆడని జాదవ్‌, శంకర్‌లు.. బంగ్లాదేశ్‌పై ప్రాక్టీస్‌ మ్యాచ్ కూడా ఆడకుంటే భారత్‌కు ఇబ్బందే. బ్యాట్స్‌మన్‌ విఫలమయినా.. బౌలర్లు మాత్రం మంచి ప్రదర్శనే చేశారు. ఇదొక్కటే టీమిండియాకు అనుకూలం. ఈ రోజు మ్యాచ్ జరిగే కార్డిఫ్‌లో మబ్బులు పట్టిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ ఆరంభంలో బంగ్లా పేసర్ల నుంచి భారత బ్యాట్స్‌మెన్‌కు పరీక్షతప్పేలా లేదు. మరోవైపు బంగ్లా పరిస్థితి భిన్నంగా ఉంది. పాక్‌తో జరగాల్సిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌ ఒక్క బంతి పడకుండానే వర్షార్పణమైంది. ఇక ఈ మ్యాచ్‌ ద్వారానైనా ప్రాక్టీస్ చేయాలని భావిస్తోంది.

Story first published: Tuesday, May 28, 2019, 8:28 [IST]
Other articles published on May 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+