Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఆటగాళ్లు దూరమైనా.. భారత జట్టు ఇంకా పటిష్ఠంగానే ఉంది'

ICC Cricket World Cup 2019: Ganguly Says 'India Have Been the Best So Far' || Oneindia
ICC Cricket World Cup 2019: India have looked the best in the World Cup so far


గాయాల కారణంగా ఆటగాళ్లు దూరమైనా.. భారత జట్టు ఇంకా పటిష్ఠంగానే ఉంది అని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. గాయం కారణంగా టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ టోర్నీ మొత్తానికి దూరమవగా.. పేసర్ భువనేశ్వర్ కుమార్ కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం గంగూలీ తన అభిప్రాయాలను తెలిపారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

పటిష్ఠంగానే ఉంది:

పటిష్ఠంగానే ఉంది:

'ధావన్ ప్రపంచకప్ టోర్నీ నుంచి నిష్క్రమించినా.. భువనేశ్వర్ రెండు మ్యాచ్‌లకు దూరమైనా భారత జట్టు ఇంకా పటిష్ఠంగానే ఉంది. వారిని భర్తీచేసేందుకు జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. భారత్ కచ్చితంగా సెమీఫైనల్ చేరుతుంది. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు టీమిండియానే అత్యుత్తమంగా కనిపించింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి' అని దాదా పేర్కొన్నారు.

భారత్‌కు ఎదురుదెబ్బే:

భారత్‌కు ఎదురుదెబ్బే:

'ఆటగాళ్లకు గాయాలు కావడం సహజమే. ఇది ఆటలో భాగం మాత్రమే. గాయాలను ఎవరూ నియంత్రించలేరు. కీలక ఆటగాళ్లు గాయాల బారినపడడం భారత్‌కు ఎదురుదెబ్బే. అయినా పాకిస్థాన్‌ను మరోసారి ఓడించింది అంటే జట్టు మంచి ఫామ్‌లో ఉన్నట్టే అర్ధం. శిఖర్ త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నా. భువీ గైర్హాజరీలో విజయ్ శంకర్ మంచి ప్రదర్శన చేశాడు. జట్టులో అందరూ రాణిస్తున్నారు. తప్పకుండా భారత్ సెమీస్‌కు చేరుతుంది. ఆ తర్వాత ఇంకా మంచి ప్రదర్శన చేయాలి' అని దాదా అన్నారు.

అఫ్గానిస్థాన్‌తో తదుపరి మ్యాచ్‌:

అఫ్గానిస్థాన్‌తో తదుపరి మ్యాచ్‌:

భారత్ తన తదుపరి మూడు మ్యాచ్‌లను ఆఫ్గనిస్తాన్ (జూన్ 22), వెస్టిండీస్ (జూన్ 27), ఇంగ్లాండ్ (జూన్ 30)లతో ఆడనుంది. స్టార్ పేసర్ భువనేశ్వర్‌కు ఎడమ తొడకండరాలు పట్టేయడంతో ఈ మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. భువీ స్థానంలో షమీ జట్టులోకి రానున్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ చేతి వేలి గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయిన విషయం తెలిసిందే. భారత్ మూడు మ్యాచ్‌లలో విజయం సాధిస్తే సెమీస్ చేరుకుంటుంది.

Story first published: Thursday, June 20, 2019, 11:25 [IST]
Other articles published on Jun 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+