న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకు షాక్.. విరాట్ కోహ్లీ వేలికి గాయం!!

ICC Cricket World Cup 2019: India captain Virat Kohli picks up injury ahead of 1st match against South Africa

ప్రపంచకప్‌లో భాగంగా మరో మూడు రోజుల్లో దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌ ఆడనున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కుడి చేతి బొటన వేలుకు గాయమైంది. తొలి మ్యాచ్‌ కోసం శనివారం నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా కోహ్లీకి గాయమైందని సమాచారం తెలుస్తోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

బొటన వేలుకు గాయం:

బొటన వేలుకు గాయం:

నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా కోహ్లీ కుడి చేతి బొటన వేలుకు గాయమైంది. గాయంతో కోహ్లీ విలవిలలాడడంతో టీమిండియా ఫిజియో పాట్రిక్.. కోహ్లీ బొటన వేలిపై స్ప్రే చల్లి ప్రథమ చికిత్స చేశాడు. అనంతరం కోహ్లీ కుదురుకున్నాడు. ప్రాక్టీస్‌ సెషన్‌ ముగింపు సమయంలో కోహ్లీ ఐస్‌ గ్లాస్‌లో వేలు పెట్టుకుని డగౌట్ చేరుకున్నాడు.

ఆందోళనలో అభిమానులు:

ఆందోళనలో అభిమానులు:

విరాట్ కోహ్లీకి అయిన గాయం బ్యాటింగ్‌ ప్రాక్టీస్ చేస్తుండగా అయిందా లేదా ఫీల్డింగ్‌ ప్రాక్టీస్ చేస్తుండగా అయిందా అనే సమాచారం తెలియరాలేదు. ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలో తొలి మ్యాచ్‌కు ముందు కోహ్లీకి గాయం అవ్వడంతో అందరూ ఆందోళనగా ఉన్నారు. ముఖ్యంగా భారత అభిమానులు. అయితే కోహ్లీ గాయంపై బీసీసీఐ, కోచ్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తొలి మ్యాచ్‌కు ఇంకా మూడు రోజుల సమయం ఉండడంతో కోహ్లీ కోలుకునే అవకాశం ఉంది.

జూన్ 5న తొలి మ్యాచ్:

జూన్ 5న తొలి మ్యాచ్:

ప్రపంచకప్‌ సమరం ఇప్పటికే ప్రారంభమయింది. ఫేవరేట్ జట్లు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు తొలి విజయాన్ని అందుకున్నాయి. హిట్టర్స్ జట్టు విండీస్ కూడా భారీ విజయాన్ని అందుకోగా .. దక్షిణాఫ్రికా అనూహ్యంగా ఓడిపోయింది. సౌథాంప్టన్‌ వేదికగా జూన్ 5న భారత్ తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఆడనుంది. భారత్ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. కోహ్లీ తొలిసారి ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

Story first published: Sunday, June 2, 2019, 13:01 [IST]
Other articles published on Jun 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X