అంబటి రాయుడికి ఐస్‌లాండ్ క్రికెట్ బంపర్ ఆఫర్

తెలుగు తేజం, క్రికెటర్ అంబటి రాయుడికి ఐస్‌లాండ్ క్రికెట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశానికి రావాలని, తమ దేశం తరఫున క్రికెట్ ఆడాలని ఐస్‌లాండ్ రాయుడిని ఆహ్వానించింది. ఆస్ట్రేలియా, ఐపీఎల్-12 ముందు వరకు టీమిండియా నాలుగో స్థానంలో రాయుడు మంచి ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్, ఐపీఎల్-12లో రాయుడు విఫలమయ్యాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

బ్యాకప్ ప్లేయర్‌గా ఎంపిక:
ఇదేసమయంలో కేఎల్ రాహుల్ పరుగుల వరద పారించాడు. మరోవైపు పంత్ కూడా అద్భుతంగా రాణించాడు. దీంతో ప్రపంచకప్‌లో 15 మందితో కూడిన జట్టులో చోటు దక్కలేదు. అయితే టీమిండియా బ్యాకప్ ప్లేయర్‌గా అంబటి రాయుడును సెలక్టర్లు ఎంపిక చేశారు. టోర్నీ జరుగుతున్నా కొద్దీ ఓపెనర్ శిఖర్ ధావన్, విజయ్ శంకర్ గాయాల కారణంగా వెనుదిరగడంతో రాయుడికి అవకాశం వస్తుందని అనుకున్నారు.
మరోసారి నిరాశే:
కానీ మొదటగా పంత్ ఇంగ్లాండ్ విమానమెక్కగా.. అనంతరం మయాంక్ అగర్వాల్ ఎక్కాడు. దీంతో రాయుడికి మరోసారి నిరాశే ఎదురైంది. ఈ ఘటనలతో అంబటి రాయుడి క్రికెట్ కెరీర్ ముగిసినట్లేనని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐస్‌లాండ్ క్రికెట్ విభిన్నంగా స్పందించింది. రాయుడు 3డీ ట్వీట్‌ను ఉద్దేశిస్తూ ఐస్‌లాండ్ ఓ ట్వీట్ చేసింది.

3డీ కళ్ల జోడును పక్కనపెట్టాలి:
'ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అగర్వాల్ 72.33 సగటుతో 3 వికెట్లు తీశాడు. ఇప్పటికైనా రాయుడు 3డీ కళ్ల జోడును పక్కనపెట్టాలి. తాము పంపిన పత్రాలు చదవడానికి మామూలు కళ్లజోడు పెట్టుకోవాలి. రాయుడు మాతో చేతులు కలుపు. మేము రాయుడు నిర్ణయాన్ని ప్రేమిస్తాం' అని ఐస్‌లాండ్ క్రికెట్ ట్వీట్ చేసింది. ఇక అంబటి రాయుడు పౌరసత్వం కావాలని ఓ దరఖాస్తు ఇస్తే సరిపోతుందని కూడా తెలిపింది. మరి రాయుడు ఈ ట్వీట్‌పై ఎలా స్పందిస్తాడో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications